English   

అతనికి 50.. ఆమెకు 23.. త్వరలో పెళ్లి

Milind-Soman
2018-04-14 17:21:27

ప్రేమ గుడ్డిది అంటారు. అది నిజమే అనడానికి ఎన్నో ఉదాహరణలున్నాయి. ఆ లిస్ట్ లోకి ఇప్పుడు మరో ఎగ్జాంపుల్ చేరింది. బాలీవుడ్ సీనియర్ మోస్ట్ మోడల్ మిలింద్ సోమన్ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడు. అతని వయసు ఇప్పుడు 50యేళ్లు. కానీ తను పెళ్లి చేసుకునే అమ్మాయి వయసు కేవలం 23. ఆ పిల్ల పేరు అంకిత కోన్వర్. మరి అంత పెద్దవాడితో పెళ్లేంటీ అంటే.. మేం ఇద్దరం ప్రేమించుకుంటున్నాం అనేసింది. అందుకే ప్రేమ గుడ్డిది అనేది.. ఇంతకీ వీరి ప్రేమ ఎక్కడ మొదలైందో తెలుసా.. చెన్నైలోని ఓ నైట్ క్లబ్ లో. అనుకోకుండా ఆ రాత్రి క్లబ్ లో కలిసిన వీరు ఆ తర్వాత ఫోన్ నంబర్స్ ఎక్సేంజ్ చేసుకుని మాటలు పెంచుకుని మనసులు మార్చుకునేంత వరకూ వెళ్లారు. ఇప్పటికే చాలా రోజులుగా లవ్ లో ఉన్న ఈ ఇద్దరూ ఫైనల్ గా ఈ నెల 21న పెళ్లి చేసుకోబోతున్నారు.  అయితే వీరి పెళ్లి, ప్రేమ విషయంపై సోషల్ మీడియలో విపరీతమైన విమర్శలు వస్తున్నాయి. అయినా వీ డోంట్ కేర్ అంటోందీ జంట. మిలింద్ కు గతంలో పెళ్లైంది. విడాకులు కూడా అయిపోయింది. ఇప్పుడీ లేటు వయసులో మరో యంగ్ బ్యూటీతో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఏదేమైనా, ఎవరేమనుకున్నా.. మేం ఇద్దరం ఒకరికి ఒకరం.. అందుకే పెళ్లి చేసుకుంటున్నాం అని ఈ జంట గట్టిగా నమ్ముతోంది. అయినా వాళ్లకు లేని ప్రాబ్లమ్.. ఈ సోషల్ మీడియా బ్యాచ్ కు ఎందుకో.. అతనేమైనా ఆమెను బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నాడా.. ప్రేమించుకునే కదా.. అయినా లీగల్ ఏజ్ దాటాక ప్రేమకు, పెళ్లికి వయసుతో పనేముందీ.. 

More Related Stories