English   

‘మిత్రోం’..పెళ్లి చూపులు హిందీలో వస్తోంది 

Mitron-Trailer
2018-08-16 15:37:32

పెళ్లి చూపులు.. టాలీవుడ్ పర్సెప్షన్ మార్చిన సినిమా. కంటెంట్ బేస్డ్ సినిమాల కోసం ఆడియన్స్ ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారో ప్రూవ్ చేసిన సినిమా. పైగా తొలి సారిగా తెరంతా తెలంగాణ స్లాంగ్ తో నిపించినా ఆంధ్ర ప్రేక్షకులూ ఆదరించిన సినిమా. ఈ మూవీతో హీరోగా పరిచయమైన విజయ్ దేవరకొండ తర్వాత ఎంత పెద్ద  స్టార్ గా మారుతున్నాడో తెలుస్తూనే ఉంది. ఇక ఈ దర్శకుడు తరుణ్ భాస్కర్ కు ఓవర్ నైట్ తిరుగులేని క్రేజ్ కూడా వచ్చింది. అలాగే సినిమాలో కమెడియన్ గా నటించిన ప్రియదర్శి కూడా స్టార్ కమెడియన్ గా మారిపోతున్నాడు. ఇలా ఎలా చూసినా.. టాలీవుడ్ లో తనకంటూ ఓ ముద్రవేసుకున్న సినిమా పెళ్లి చూపులు. అలాంటి సినిమా ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ అయింది. హిందీలో ఈ సినిమా పేరు ‘‘మిత్రోం’’.  లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ కూడా విడుదలైంది. 

తెలుగు సినిమా ఫన్ కుఏ మాత్రం తగ్గకుండా బాలీవుడ్ లో కూడా మాగ్జిమం ఫన్ జెనరేట్ అయ్యలా చూసుకున్నాడు అక్కడి దర్శకుడు నితిన్ కక్కర్. విక్రమ్ మల్హోత్రా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. జాకీ భగ్నానీ హీరోగా నటిస్తోన్న ఈ మూవీతో క్రితికా కామ్రా హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఇక తెలుగులో పెళ్లిచూపులు సీన్ ఎంత ఫన్ గా ఉందో.. ఈ ట్రైలర్ లో ఒక్క సీన్ అంతకు మించి అన్నట్టుగా ఉంది. మొత్తంగా హిందీ పెళ్లి చూపులు ట్రైలర్ చాలా ప్రామిసింగ్ గా కనిపిస్తోంది. చూద్దాం.. మరి ఈ సినిమా అక్కడ ఎలాంటి విజయం సాధిస్తుందో..  

More Related Stories