English   

హ్యాపీ వెడ్డింగ్ కు షాక్

happy wedding
2018-07-29 10:24:20

సుమంత్ అశ్విన్, నిహారిక జంటగా వచ్చిన సినిమా హ్యాపీ వెడ్డింది. ఈ శనివారం విడుదలైన ఈ హ్యాపీ వెడ్డింగ్ కు ముందు నుంచే పెద్దగా బజ్ లేదు. అది కలెక్షన్స్ లోనూ ప్రభావం చూపించింది. ఓవర్శీస్ లో మరీ దారుణంగా ఉంటే తెలుగులో కనీస ఓపెనింగ్ కూడా సంపాదించుకోలేకపోయింది. అందుకు తగ్గట్టుగానే కంటెంట్ కూడా కొత్తదనం లేకపోవడం.. సీరియల్ లాంటి సాగదీత కూడా సినిమాపై నెగెటివ్ ఇంపాక్ట్ చూపించింది. ఇక కథా పరంగా పెద్దగా కొత్తదనం లేకపోయినా.. కథనం కూడా ఆసక్తిగా లేదనే టాక్ వచ్చింది. 

లక్ష్మీకాంత్ కార్య అనే కొత్త దర్శకుడు చేసిన ఈ సినిమా ఏకంగా లీడ్ పెయిర్ కెరీర్ పైనే పెద్ద ప్రభావం చూపించొచ్చంటున్నారు. సుమంత్ అశ్విన్ ఏదో యాడ్ లో నటుడులా కనిపిస్తే.. నిహారిక ఇంకా ఫస్ట్ మూవీ ఒక మనసు మూడ్ లోనుంచి బయటకు రాకుండా మూడీగా ఉందనే టాక్ వచ్చింది. మొత్తంగా మెగా ఫ్యాన్స్ వరకూ ఈ సినిమా సూపర్ హిట్ అంటున్నా.. చాలామంది హ్యాపీ వెడ్డింగ్ కంటే టివి సీరియల్స్ బెటర్ అంటున్నారు. మొత్తంగా యూఎస్ లో మినిమం ఎఫెక్ట్ కూడా చూపించలేకపోయిన హ్యాపీ వెడ్డింగ్ లీడ్ పెయిర్ అయిన సుమంత్ అశ్విన్, నిహారికల కెరీర్ కు శాడ్ ఎండింగ్ ఇచ్చేలా ఉందంటున్నారు. మరి ఫైనల్ గా ఈ వెడ్డింగ్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి. 

More Related Stories