English   

కాజల్ అంత సిరాకు పడుతోందా..?

MLA-Hey-Indu
2018-03-13 10:51:24

ఇలాగే అనిపిస్తుందీ పాట వింటే. అయినా సన్నజాజిలాంటి సోయగాన్ని చూసి ఎవరు మాత్రం మనసు పారేసుకోరు. అలా పారేసుకున్న ఓ కుర్రాడిని చూసి తెగ సిరాకు పడిపోతోందీ చందమామ. అందుకే ఆమెను పొగుడుతూ వెంట పడుతున్నాడీ ఎమ్మెల్యే. హే ఇందు ఓ ఇందూ నా ఇందూ సిరాకు పడకే నువ్వు ముంద.. ఇద్దరమొకటే ముందు అంటూ ప్రాధేయపడుతూనే.. ఫ్యూచర్ చెప్పేస్తున్నాడీ ఎమ్మెల్యే. యస్.. ఇవాళ ఉదయం విడుదల చేసిన పాటలోని లిరిక్సే ఇవన్నీ. మెలోడీ బ్రహ్మగా చెప్పుకునే మణిశర్మ మ్యూజిక్ అందిస్తోన్న ఈ మూవీలోని ఈ పాట హైలెట్ అయ్యే అవకాశాలున్నాయి. మణిశర్మ మ్యాజిక్ మళ్లీ కళ్యాణ్ రామ్ కు వర్కవుట్ అయ్యేలానే ఉంది. 

ఉపేంద్ర మాధవ్ అనే కొత్త కుర్రాడు డైరెక్ట్ చేస్తోన్న ఎమ్మెల్యే లో కళ్యాణ్ రామ్ రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నాడు. కాజల్ ఫస్ట్ మూవీ కళ్యాణ్ రామ్ తోనే చేసింది. మళ్లీ ఇన్నాళ్లకు అతనితో జత కట్టింది.  అప్పటికీ ఇప్పటికీ కాజల్ పెద్దగా మారలేదు కానీ.. కళ్యాణ్ రామ్ చాలా చేంజ్ అయ్యాడు. యూత్ ఫుల్ లుక్స్ తో చాలా యంగ్ గా కనిపిస్తున్నాడు. ఎమ్మెల్యే నుంచి ఈ రెండో పాట సింప్లీ సూపర్బ్ అనే చెప్పాలి. కాసర్ల శ్యామ్ రాసిన ఇందు పాటను రాహుల్ సిప్లింగంజ్ చాలా అందంగా పాడేశాడు. ఏదేమైనా మణిశర్మ, కళ్యాణ్ రామ్ కాంబోలో అతనొక్కడే వచ్చింది. ఆ మూవీ ఆడియో పరంగానూ పెద్ద హిట్. ఇప్పుడు మళ్లీ ఆ సెంటిమెంట్ రిపీట్ అయితే కళ్యాణ్ రామ్ కు తిరుగే ఉండదు. 

ఇక ఈ మూవీ ఆడియో ను ఈ నెల 17న విడుదల చేయబోతున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా రాబోతున్నాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలూ పూర్తి చేసుకున్న ఎమ్మెల్యే ఈ నెల 23న ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. 

More Related Stories