English   

ఎమ్మెల్యే ఎలా ఉంటాడో తెలుసా..? 

Kalyan-Ram-MLA
2018-03-16 10:36:50

ఎమ్మెల్యే.. ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ఈ సినిమా పేరు బాగానే వినిపిస్తుంది. క‌ళ్యాణ్ రామ్ వ‌ర‌స ఫ్లాపుల్లో ఉన్నా కూడా ఎందుకో కానీ ఈ సినిమాపై అంచ‌నాలు మాత్రం బాగానే ఉన్నాయి. ఆ మ‌ధ్య అనిల్ రావిపూడికి ద‌ర్శ‌క‌త్వ అవ‌కాశం ఇచ్చి ప‌టాస్ తో బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్నాడు క‌ళ్యాణ్ రామ్. ఇప్పుడు ఉపేంద్ర మాధ‌వ్ అనే కొత్త ద‌ర్శ‌కుడికి అవ‌కాశం ఇచ్చాడు. ఈయ‌న కూడా అనిల్ రావిపూడి బ్యాచే. పైగా ఎమ్మెల్యే సినిమా కూడా ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ సినిమా. ప‌టాస్ త‌ర‌హాలోనే మొద‌ట్నుంచీ చివ‌రి వ‌ర‌కు న‌వ్వించ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నాడు క‌ళ్యాణ్ రామ్. తాజాగా ఈ చిత్ర సెన్సార్ పూర్త‌యింది. యు కు తోడుగా ఏ ఇచ్చారు బోర్డ్. సినిమాలో చంద‌మామ అందాల‌తో పాటు అక్క‌డ‌క్క‌డా యాక్ష‌న్ పార్ట్ కూడా ఉంటుంది. దాంతో చిన్న‌పిల్ల‌లు పెద్దోళ్ల‌ను సాయం తెచ్చుకోవాలని నిర్ణ‌యించారు సెన్సార్ స‌భ్యులు. 

మార్చ్ 23న విడుద‌ల కానుంది ఎమ్మెల్యే. ఎమ్మెల్యే ప్రీ రిలీజ్ వేడుక క‌ర్నూల్ లో మార్చ్ 17న జ‌ర‌గ‌నుంది. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా వ‌స్తున్నాడు. నంద‌మూరి అన్నాద‌మ్ముల‌ను ఒకే వేదిక‌పై చూడ్డానికి అభిమానులు కూడా వేయిక‌ళ్ల‌తో వేచి చూస్తున్నారు. ప్రీ రిలీజ్ వేడుక‌కు రెండు రోజుల ముందే పాట‌లు కూడా విడుద‌ల చేసారు. మ‌నిశ‌ర్మ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. రెండు పాట‌ల‌కు రిపీటెడ్ ట్యూన్స్ అనిపించినా హే ఇందు.. గాళ్ ఫ్రెండ్ గాళ్ ఫ్రెండ్ పాట‌ల‌కు మాత్రం రెస్పాన్స్ బాగానే ఉంది. మొత్తానికి విడుద‌ల‌కు వారం రోజుల ముందే సెన్సార్ తో పాటే అన్నీ పూర్తి చేసుకుని సిద్ధంగా ఉన్నాడు ఈ మంచి ల‌క్ష‌ణాలున్న అబ్బాయి. 

More Related Stories