English   

ఆ ఎమ్మెల్యే ప్ర‌చారం మొద‌లైంది..

Kalyan Ram

నంద‌మూరి కుటుంబానికి రాజ‌కీయాల‌కు విడ‌దీయ‌రాని అనుబంధం ఉంది. ఆ మాట‌కొస్తే రాష్ట్ర రాజ‌కీయం పుట్టిందే మా ఇంట్లో అని లెజెండ్ లో భారీ డైలాగులు చెప్పాడు బాల‌య్య‌. ప్ర‌స్తుతం రాజ‌కీయాల‌తో పాటు సినిమాల్లో బిజీగా ఉన్నాడు బాల‌కృష్ణ‌. ఇక జూనియర్ ఎన్టీఆర్ కూడా అప్ప‌ట్లో కొన్ని రోజులు రాజ‌కీయాలు చేసి ఇప్పుడు సినిమాల‌తో బిజీ అయ్యాడు. ఈ మ‌ధ్యే జై ల‌వ‌కుశ‌లోనూ పాలిటిక్స్ చేసాడు జూనియ‌ర్. ఇప్పుడు క‌ళ్యాణ్ రామ్ వంతు. ఈయ‌న కూడా పాలిటిక్స్ లోకి అడుగు పెట్టాడు. అయితే ఇది రియ‌ల్ లైఫ్ లో మాత్రం కాదు.. రీల్ లైఫ్ లో. అవును.. రాజ‌కీయ నేప‌థ్యం ఉన్న ఎమ్మెల్యే సినిమాలో ఈయ‌న న‌టిస్తున్నాడు. ఇప్ప‌టికే షూటింగ్ చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. సంక్రాంతి సంద‌ర్భంగా వ‌చ్చిన టీజ‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

త‌న ట్యాప్ గుర్తుకే ఓటేయండి అంటూ ప్ర‌చారం మొద‌లుపెట్టాడు నంద‌మూరి హీరో. కొత్త ద‌ర్శ‌కుడు ఉపేంద్ర మాధ‌వ్ చెప్పిన క‌థ న‌చ్చడంతో పొలిటిక‌ల్ స్టోరీ వైపు అడుగేస్తున్నాడు క‌ళ్యాణ్ రామ్. యిజం త‌ర్వాత ఈయ‌న చేస్తోన్న సినిమా ఇదే. ఎమ్మెల్యే అంటే మంచి ల‌క్ష‌ణాలున్న అబ్బాయి అంటున్నాడు క‌ళ్యాణ్ రామ్. ఇందులో ఓ రాజ‌కీయ నాయకుడిని స‌వాల్ చేసి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎలా గెలుస్తాడ‌నేది క‌థ‌గా తెలుస్తోంది. మార్చ్ 23న‌ ఈ చిత్రం విడుద‌ల కానుంది. కాజ‌ల్ ఈ సినిమాలో హీరోయిన్ గా న‌టిస్తుంది. తాజాగా విడుద‌లైన ఓ కొత్త పోస్ట‌ర్ ను విడుద‌ల చేసారు చిత్ర‌యూనిట్. అందులో కాజల్ కు తినిపిస్తూ క‌ళ్యాణ్ రామ్ చూపిస్తున్న ప్రేమ వాళ్ల కెమిస్ట్రీని చూపిస్తుంది. ల‌క్ష్మీక‌ళ్యాణం త‌ర్వాత ఈ ఇద్ద‌రూ క‌లిసి న‌టిస్తున్న సినిమా ఇదే. మ‌రి చూడాలి.. క‌ళ్యాణ్ రామ్ కు రాజ‌కీయాలు ఎంత వ‌ర‌కు క‌లిసొస్తాయో..?

More Related Stories