ఎమ్మెల్యే జూదం పెద్దదే..!

కళ్యాణ్ రామ్ కు ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేదు. ఆయన గత సినిమాలు యిజం.. షేర్ డిజాస్టర్లుగా నిలిచాయి. అయినా కానీ ఇప్పుడు ఎమ్మెల్యే సినిమా బిజినెస్ అదిరిపోయేలా జరిగింది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ఏకంగా 22 కోట్లకు చేరింది. థియెట్రికల్ బిజినెస్ 15 కోట్లకు పైగానే అయింది. ఇప్పుడు ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే 15 కోట్ల షేర్ తీసుకురావాలి. బ్లాక్ బస్టర్ అనిపించుకోవాలంటే కళ్యాణ్ రామ్ తన కెరీర్ లోనే పెద్ద హిట్ కొట్టాలి. ఎమ్మెల్యే సినిమాపై మంచి అంచనాలున్నాయి.. పైగా ఈయన కూడా చాలా నమ్మకంగా కనిపిస్తున్నాడు. తనకు పటాస్ తర్వాత కెరీర్ లో అంత పెద్ద హిట్ అవుతుందని భావిస్తున్నాడు నందమూరి హీరో. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు రెస్పాన్స్ అదిరిపోయింది. పటాస్ తరహాలోనే పూర్తిస్థాయి కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రం వస్తుంది. ఉపేంద్ర మాధవ్ ఈ చిత్రానికి దర్శకుడు. కాజల్ 12 ఏళ్ళ తర్వాత మళ్లీ కళ్యాణ్ రామ్ తో కలిసి నటించింది. లక్ష్మీకళ్యాణంతోనే ఈమె తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. మళ్లీ ఇన్నేళ్లకు కలిసి నటించారు ఈ జోడి. ఇక ఈ సినిమా మార్చ్ 23న విడుదల కానుంది. ఈ ఎమ్మెల్యే హిట్ కొట్టాలంటే ముందు కళ్యాణ్ రామ్ తన కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ కొట్టాలి. మొత్తానికి లెక్క భలే సెట్ చేసారు. మరి చూడాలిక.. ఈ జూదంలో ఎమ్మెల్యే పయనం ఎటువైపు ఉంటుందో..?