English   

ఎమ్మెల్యే రివ్యూ 

MLA-Movie-Review
2018-03-23 14:09:22

రాజ‌కీయ నేప‌థ్యం ఉన్న సినిమాలు తెలుగులో రావ‌డం చాలా త‌క్కువ‌. ఈ మ‌ధ్యే అవి ఎందుకో బాగా ఎక్కువ‌య్యాయి. ఇప్పుడు ఎమ్మెల్యే కూడా ఇలా వ‌చ్చిన సినిమానే. మ‌రి క‌ళ్యాణ్ రామ్ రాజ‌కీయాలు ఎంత‌వ‌ర‌కు ప‌నికొచ్చాయి..? ప‌్రేక్ష‌కుల‌కు న‌చ్చాయా లేదా..? అనేది అస‌లు క‌థ‌. 

క‌థ‌: క‌ళ్యాణ్(క‌ళ్యాణ్ రామ్) మంచి ల‌క్ష‌ణాలున్న అబ్బాయి. అంటే షార్ట్ ఫామ్ లో ఎమ్మెల్యే అని అర్థం. త‌న చ‌దువు పూర్తి చేసుకుని జాబ్ కోసం ఎదురు చూస్తుంటాడు. ఆ టైమ్ లో త‌న చెల్లి(లాస్య‌)  ఇంకో వ్య‌క్తి (వెన్నెల కిషోర్)ని ప్రేమిస్తుంది. క‌ళ్యాణ్ వాళ్ల ఇంట్లో చెల్లి ప్రేమ పెళ్లి న‌చ్చ‌దు. దాంతో బావ‌తో క‌లిసి బెంగ‌ళూర్ వెళ్లిపోతాడు క‌ళ్యాణ్. అక్క‌డే యిందు(కాజ‌ల్)ను చూసి ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఆ త‌ర్వాత తాను ప‌ని చేస్తోన్న కంపెనీ ఛైర్మెన్ కూతురే యిందు అని తెలుస్తుంది. కానీ ఆమెపై ఓసారి కిడ్నాపింగ్ ఎటాక్ జ‌రుగుతుంది. అస‌లు యిందు ఎవ‌రు..? ప‌్రేమిస్తోన్న క‌ళ్యాణ్ ని కూడా కాద‌ని ఎందుకు అత‌న్ని మోసం చేస్తుంది..? అస‌లు మ‌ధ్య‌లో ఎమ్మెల్యే గాడ‌ప్ప‌(ర‌వికిష‌న్) ఎందుకొచ్చాడు..? ఎందుకు క‌ళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడు అనేది మిగిలిన క‌థ‌. 

క‌థ‌నం: తెలుగులో పొలిటిక‌ల్ స్టోరీస్ రావ‌డం చాలా త‌క్కువ‌. అలాంటి కోవ‌లోకి వ‌చ్చే సినిమా ఎమ్మెల్యే. ముందు ఈ చిత్రంలో రాజ‌కీయాలే ఉండ‌వేమో అనుకున్నారు కానీ ఇది కూడా రాజ‌కీయ నేప‌థ్యం ఉన్న సినిమానే అని ట్రైల‌ర్ తోనే చెప్పేసాడు ద‌ర్శ‌కుడు. ఇప్పుడు సినిమాలో కూడా బాగానే రాజ‌కీయాలు చేసాడు క‌ళ్యాణ్ రామ్. ఓవైపు మంచి ల‌క్ష‌ణాలున్న అబ్బాయి అంటూనే పాలిటిక్స్ కూడా చాలా చేసాడు. ఫ‌స్ట్ హాఫ్ లో అస‌లు రాజ‌కీయాలే లేకుండా జాగ్ర‌త్త ప‌డిన ఉపేంద్ర మాధ‌వ్.. సెకండాఫ్ లో పాలిటిక్స్ కాకుండా మ‌రేం పెట్ట‌లేదు. ఫ‌స్ట్ హాఫ్ లో ఎంట‌ర్ టైన్మెంట్ పైనే దృష్టి పెట్టాడు ద‌ర్శ‌కుడు. కాజ‌ల్, క‌ళ్యాణ్ రామ్ మ‌ధ్య ల‌వ్ సీన్స్.. పోసాని కామెడీ ట్రాక్.. వెన్నెల కిషోర్ ఎంట‌ర్ టైనింగ్ ఫ్యామిలీ ఎపిసోడ్స్ వీట‌న్నింటినీతోనే ఫ‌స్టాఫ్ అయిపోతుంది. సెకండాఫ్ లో అస‌లు క‌థ‌లోకి వెళ్లాడు ద‌ర్శ‌కుడు. అక్క‌డే బాల‌కార్మిక విధానాన్ని కూడా ప్ర‌శ్నించాడు. ఇక విద్యావ్య‌వ‌స్థ గురించి కూడా కొన్ని పాయింట్స్ చెప్పాడు. ప్రేమ కోసం హీరో ఎమ్మెల్యే అవ్వాల‌నుకోవ‌డం కాస్త ఓవ‌ర్ గానే అనిపించినా.. క‌మ‌ర్షియ‌ల్ పంథాలో ఇవ‌న్నీ కామ‌న్. ఇక సెకండాఫ్ లో నామినేష‌న్ సీన్ బాగా కుదిరింది. అక్క‌డ క‌ళ్యాణ్ రామ్ డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. పైగా దానికి క‌న్విన్సింగ్ గా స్క్రీన్ ప్లే రాసుకున్నాడు ద‌ర్శ‌కుడు. క్లైమాక్స్ ఊహించిన‌ట్లుగా  ముగించాడు. 

న‌టీన‌టులు: క‌ళ్యాణ్ రామ్ చాలా బాగా న‌టించాడు. ఈయ‌న న‌ట‌న‌కు పేరు పెట్టాల్సిన ప‌నేముంది. ప‌టాస్ త‌ర్వాత మ‌రోసారి అదే జోష్ చూపించాడు ఈ హీరో. ఇక స్టైలింగ్ లో.. క్యాస్ట్యూమ్స్ లో.. లుక్స్ విష‌యంలో చాలా కొత్తగా ఉన్నాడు క‌ళ్యాణ్ రామ్. కాజ‌ల్ ఉన్నంత‌లో బాగా చేసింది. ఈమె పాత్ర కూడా క‌థ‌లో కీల‌కం ఏం కాదు. పాట‌ల‌కు మాత్ర‌మే ఉన్న‌ట్లుంది. ర‌వికిష‌న్ విల‌న్ గా ఓకే. పోసాని ఫ‌స్టాఫ్ లో కామెడీని బాగానే మోసాడు. ఇక వెన్నెల కిషోర్, లాస్య లాంటి వాళ్లంతా త‌మ పాత్ర‌ల పరిధి మేర‌కు బాగానే చేసారు.

టెక్నిక‌ల్ టీం: మ‌ణిశ‌ర్మ మ‌రోసారి త‌న రోటీన్ మ్యూజిక్ ఇచ్చాడు. ఆర్ఆర్ అయితే మ‌రీ రొటీన్ గా ఉంది. ముఖ్యంగా క‌ళ్యాణ్ రామ్ క‌త్తి.. అత‌నొక్క‌డే లాంటి సినిమాల్లో ఇచ్చిన ఆర్ఆర్ మ‌ళ్లీ కొట్టాడు. ఇక సినిమాటోగ్ర‌ఫీ పర్లేదు. ప్ర‌సాద్ మూరెళ్ల ఫారెన్ అందాల‌ను బాగానే చూపించాడు. త‌మ్మిరాజు ఎడిటింగ్ బాగుంది. ఎక్క‌డా పెద్ద‌గా బోర్ సీన్స్ ఏవీ లేవు కానీ పాత క‌థ కాబ‌ట్టి ఆ ఫీలింగ్ వ‌స్తుందంతే. ఇక ద‌ర్శ‌కుడిగా ఉపేంద్ర మాధ‌వ్ తొలి సినిమాకు ఎలాంటి రిస్క్ తీసుకోలేదు. పూర్తిగా సేఫ్ గేమ్ ఆడేసాడు. డైలాగ్స్ విష‌యంలో బాగా రాసుకున్నాడు. ఓవ‌రాల్ గా ఎమ్మెల్యే ఓ రొటీన్ క‌మ‌ర్షియ‌ల్ ప్ర‌య‌త్నం. 

చివ‌ర‌గా: ఎమ్మెల్యే.. మాస్ ల‌క్ష‌ణాలున్న అబ్బాయి..

రేటింగ్: 2.75/5

More Related Stories