English   

మోహన్ బాబు సన్ ఆఫ్ ఇండియా.. పంద్రాగస్ట్ కానుకగా..

Mohan Babu
2020-08-15 14:16:12

రెండేళ్ల కింద వచ్చిన గాయత్రి తర్వాత నటనకు దూరంగా ఉన్నాడు మోహన్ బాబు. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈయన మొహానికి మేకప్ వేసుకుంటున్నాడు. నచ్చిన కథ వస్తే తప్పకుండా నటిస్తానని చెప్పిన కలెక్షన్ కింగ్.. ఇప్పుడు అదే పని చేస్తున్నాడు. పంద్రాగస్ట్ కానుకగా దేశ భక్తి నేపథ్యంలో ఈయన ప్రధాన పాత్రలో 'సన్ ఆఫ్ ఇండియా' సినిమాను తెరకెక్కిస్తున్నాడు డైమండ్ రత్నబాబు. ఈ సినిమాతో రైటర్ డైమండ్ రత్నబాబు దర్శకుడిగా మారుతున్నాడు. 74వ స్వాతంత్ర దిన వేడుకలను పురస్కరించుకుని ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో మోహన్ బాబు సీరియస్ లుక్ లో కనిపిస్తున్నారు. భారతీయుడు తరహాలో ఇది కూడా పూర్తిగా దేశభక్తి నేపథ్యంలోనే సాగుతుంది. పోస్టర్ లో అశోక చక్రం.. బ్యాగ్రౌండ్ లో భారతదేశ చిత్రపటం కనిపిస్తున్నాయి. ఈ సినిమాను 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్స్ పై మోహన్ బాబు నిర్మిస్తున్నారు. మోహన్ బాబు గతంలో మేజర్ చంద్రకాంత్, పుణ్యభూమి నా దేశం లాంటి సందేశాత్మక చిత్రాలు చేసాడు. ఇప్పుడు మళ్లీ సన్ ఆఫ్ ఇండియా సినిమాతో వస్తున్నాడు. 

More Related Stories