English   

ఇంద్ర‌గంటి.. నువ్ మామూలోడివి కాదయ్యా..!

Indraganti-Sammohanam
2018-06-16 18:25:14

కంటెంట్ ఉన్నోడి క‌టౌట్ చాలు ర‌ప్ఫాడించ‌డానికి.. ఇదే లైన్ సినిమాల‌కు కూడా ప‌నికొస్తుంది. క‌థ ఉన్న సినిమా చాలు.. చిన్నా పెద్దా తేడా లేకుండా క‌లెక్ష‌న్లు తీసుకురావడానికి. ఇప్పుడు స‌మ్మోహ‌నం సినిమాను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది మ‌రి. ఇందులో సూప‌ర్ స్టార్స్ ఎవ‌రూ లేరు. కానీ క‌థ ఉంది.. కామెడీ ఉంది. ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచుకునే ఎమోష‌న్స్ ఉన్నాయి. అది చాలు క‌దా ప్రేక్ష‌కులు క‌నెక్ట్ అవ్వ‌డానికి. ఇప్పుడు ఇదే జ‌రుగుతుంది. స‌మ్మోహ‌నం స‌మ్మోహ‌న‌ప‌రుస్తుంది. ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ తెర‌కెక్కించిన ఈ చిత్రం ఈ వార‌మే విడుద‌లైంది. నా నువ్వే అంటూ క‌ళ్యాణ్ రామ్ వ‌చ్చినా కూడా ఈ సినిమా తొలిరోజే రిట‌ర్న్ అయిపోయింది. దాంతో ఇప్పుడు స‌మ్మోహ‌నం అద్భుత‌మైన వ‌సూళ్లు రాబ‌డుతుంది. సుధీర్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అయ్యేలా క‌నిపిస్తుంది ఈ చిత్రం. ఇక అదితిరావ్ తెలుగు ఇండ‌స్ట్రీకి అదిరిపోయేలా అడుగు పెట్టింది. మ‌రో రెండు వారాల వ‌ర‌కు కూడా మార్కెట్ లో చెప్పుకోద‌గ్గ సినిమాలేవీ రావ‌డం లేదు. దాంతో స‌మ్మోహ‌నంకు తిరుగులేక‌పోవ‌చ్చు. అన్న‌ట్లు ఇది ఇంద్ర‌గంటికి వ‌ర‌స‌గా మూడో విజ‌యం. చాప‌కింద‌నీరులా జెంటిల్ మ‌న్.. అమీతుమీ.. ఇప్పుడు స‌మ్మోహ‌నం.. హ్యాట్రిక్ కొట్టేసాడు ఈ ద‌ర్శ‌కుడు. ఒక‌ప్పుడు ప్ర‌శంస‌ల ద‌గ్గ‌రే ఆగిపోయే ఈయ‌న సినిమాలు ఇప్పుడు పైస‌ల ప‌రంగా కూడా దుమ్ము లేపేస్తున్నాయి. 

More Related Stories