English   

 సూర్య సినిమాకు ఎన్ని స్పెషాలిటీసో... 

suriya-mohanlal

సూర్య.. కోలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకడు. ఇప్పటికే ఆర్టిస్ట్ గా తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇక చాలెజింగ్ రోల్స్ అంటే తెగ ఇష్టపడే సూర్య ఇప్పుడు మరో వైవిధ్యమైన పాత్రకు ఓకే చెప్పాడు. గతంలో సూర్య .. దర్శకుడు కెవి ఆనంద్ తో కలిసి మాత్రాన్(తెలుగులో బ్రదర్స్) అనే సినిమా చేశాడు. ఇది ఫ్లాప్ అయినా సూర్య ప్రయోగానికి ప్రశంసలు వచ్చాయి. ఈ మూవీలో సూర్య అవిభక్త కవలలుగా నటించాడు. వినడానికి బానే ఉన్నా.. ఈ పాత్ర చేయాలంటే గట్స్ ఉండాలి. అవి ఉన్నాయి కాబట్టే ఈ సినిమా పోయినా.. ఇప్పుడు ఆ సినిమా దర్శకుడు కె వి ఆనంద్ తో మరో సినిమాకు చాన్స్ ఇచ్చాడు.. ఇది కూడా బ్రదర్స్ లాగా డిఫరెంట్ కాన్సెప్ట్ తో సాగే సినిమా అంటున్నారు. నిజానికి బ్రదర్స్.. తమిళంలో కూడా ఫ్లాప్. అయినా మళ్లీ ప్రయోగానికే పోతున్నారంటే వీళ్లిద్దరూ ఖచ్చితంగా హిట్ కొట్టాలని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయినట్టున్నారు.
 
కంట్రీ మొత్తం కంప్లీట్ యాక్టర్ ఎవరంటే చూపించే పేరు మోహన్ లాల్. ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్న మోహన్ లాల్ కూడా సూర్య సినిమాలో నటిస్తున్నాడు. ఓ వైపు హీరోగా మళయాల మార్కెట్ ను 
వంద కోట్లు దాటిస్తూనే  మరోవైపు ఇతర భాషల్లో క్యారెక్టర్స్ చేయడానికీ ఇబ్బంది పడటం లేద సూపర్ స్టార్. సూర్య, కెవి ఆనంద్ సినిమాలో అతనికి అత్యంత కీలక పాత్ర అని చెబుతున్నారు. అంటే మన 

జనతా గ్యారేజ్ లాగా అన్నమాట. మరో విశేషం ఏంటంటే ఈ సినిమాలో మన తెలుగు కుర్రాడు.. అల్లు వారబ్బాయ్.. శిరీష్ కూడా యాక్ట్ చేస్తున్నాడు. శిరీష్ ఉన్నాడు కాబట్టి.. ఈసినిమాకు తెలుగులో 
‘ఓపెనింగ్స్’ కు ఢోకా ఉండదేమో.. మొత్తంగా భారీ తారాగణంతో వస్తోన్న ఈ సినిమాలో అందరికంటే ఎక్కువ లక్కీ అంటే అఖిల్ బ్యూటీనే. యస్.. అఖిల్ తో టాలీవుడ్ కు పరిచయం అయిన సాయేషా సైగల్ హీరోయిన్ గా నటిస్తోందీ. సినిమాలో. అవును మరి.. ఇంత పెద్ద తారాగణం ఉన్నసినిమాలో హీరోయిన్ అంటే ఖచ్చితంగా మంచి గుర్తింపే వస్తుంది. అయితే సాయేషా ఆల్రెడీ సూర్య తమ్ముడు కార్తీ సినిమాలోనూ హీరోయిన్ గా నటిస్తుండటం విశేషం. మొత్తంగా క్రేజీ ప్రాజెక్ట్ గా చెబుతోన్న ఈ మూవీ మూడు భాషల్లోనూ విడుదలవుతుంది.. 

More Related Stories