English   

నందమూరి వారసుడు ఎక్కడికి వెళ్తున్నాడబ్బా 

Mokshagna
2020-01-17 11:14:15

నందమూరి అభిమానులు తమ వారసుడి ఎంట్రీ కోసం చాలా కాలం నుండీ ఎదురు చూస్తున్నారు. దాదాపు నాలుగైదేళ్ళుగా బాలయ్య తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీపై వార్తలు వినిపిస్తున్నాయి. ఒక దశలో బాలయ్య కూడా మరో ఏడాదిలో మోక్షజ్ఞ ఎంట్రీ కన్‌ఫర్మ్‌ అంటూ అభిమానులను ఊరిస్తూ వస్తున్నాడు. గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాలో మోక్షజ్ఞ అతిధి పాత్రలో నటిస్తాడన్న ప్రచారం అలాగే ఆ సినిమాకి అసిస్టంట్గా పని చేశాడన్న ప్రచారం గట్టిగా సాగింది. అయితే అవన్నీ పుకార్లుగానే మిగిలిపోయాయి.

తరువాత ఒకటి రెండు సార్లు పబ్లిక్‌ ఫంక్షన్స్‌లో కనిపించి మోక్షజ్ఞ లుక్‌ కూడా సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీపై అనుమానాలు కలిగించింది. అయితే తాజాగా మరో సారి కెమెరా కంటికి చిక్కాడు మోక్షజ్ఞ. బాలకృష్ణ తన తనయుడు మోక్షజ్ఞతో కలిసి ఎక్కడికో బయల్దేరాడు. హైదరాబాద్ విమానశ్రయంలో ఆ ఇద్దరో కెమెరా కంటికి చిక్కడంతో ఆ ఫోటోలు బయటకు వచ్చాయి.

హైదరాబాద్ నుంచి ఎక్కడికైనా వెళుతున్నారా లేక హైదరాబాద్ లో ల్యాండ్ అయ్యి ఇంటికొస్తున్నారా అనేది మాత్రం క్లారిటీ లేదు. ప్రతిసారీ సంక్రాంతి పండుగని వియ్యంకుడు చంద్రబాబు నాయుడు కుటుంబంతో సెలబ్రేట్ చేసుకోవడం బాలయ్య ఫ్యామిలీకి అలవాటు. కానీ ఈ సారి ఆ అమరావతి పుణ్యామా అని ఆ హడావుడి లేదు. మరి వీరిద్దరూ ఎక్కడికి వెళ్లినట్లో ?

More Related Stories