English   

శృతి మించుతున్న అఖిల్, మోనాల్ మధ్య వ్యవహారం..

Monal Gajjar Akhil
2020-10-20 13:28:24

మీ ఇంటితో పాటు మా ఇంటిపై కూడా రెండు కళ్ళేసి ఉండండి అంటూ నాగార్జున చెబుతున్నా కూడా.. అలా ఇంటిల్లిపాది కూర్చుని చూసే పద్ధతైన షో బిగ్ బాస్ కాదు. ఎందుకంటే అందులో చాలా వింతలు విశేషాలు జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా కొన్ని జంటల మధ్య రొమాన్స్ శ్రుతి మించిపోతుంది. అది వాళ్ళు చెప్పినా అర్థం చేసుకునే పొజిషన్ కూడా దాటిపోయారు. తమ చుట్టూ కెమెరాలు ఉన్నాయి.. కోట్ల మంది తమ అని చూస్తున్నారు అనే విషయం కూడా వాళ్లు మరిచిపోయి రొమాన్సులో తేలిపోతున్నారు. బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడు ఒక చోట చేస్తున్న పని చూసి ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. నెటిజన్లు కూడా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఆ జంట అఖిల్, మోనాల్. వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ కుదిరింది. దాన్ని వాళ్ళిద్దరూ మరో స్థాయికి తీసుకు వెళ్తున్నారు. 

కెమెరా కళ్ళు తమపై ఉన్న విషయం కూడా మరిచిపోయి కౌగిలింతలు ముద్దులతో రెచ్చిపోతున్నారు. ఉదయం లేవగానే అఖిల్ అంటూ మోనాల్ పరుగులు అటువైపు పడుతున్నాయి. ఆయన లేకపోతే ఇంకెవరు అవసరం లేదు అన్నట్లు ఈమె ప్రవర్తన మారిపోయింది. మరోవైపు అఖిల్ కూడా ఈమెకు అంతే ఎడిక్ట్ అయిపోయాడు. ఎవరు చెప్పినా వినే పరిస్థితుల్లో కూడా లేడు. మొన్నటికి మొన్న ఎలిమినేషన్ నుంచి మోనాల్ సేవ్ అయిందని తెలియగానే వెళ్లి ఆమెను గట్టిగా హత్తుకున్నాడు. ఇద్దరు తెగ రొమాన్స్ చేసుకున్నారు. ఈ వీడియోలు ఫోటోలు చూసి ఇది నిజంగా ఫ్యామిలీ షో నేనా అని విమర్శిస్తున్నారు. మరి వీళ్ళు రొమాన్స్ అడ్డుకట్ట ఎక్కడ పడుతుందో చూడాలి. 
 

More Related Stories