English   

సోనూ కు వింత రిక్వెస్ట్..మోనాల్ ని కాపాడండి సార్

 Monal Gajjar
2020-10-31 14:49:52

బిగ్ బాస్ సీజన్-4 లో కంటెస్టెంట్స్ ఎక్కువ మంది ప్రేక్షకులకు  పరిచయం లేని వారైనప్పటికి లవ్ ట్రాక్ లతో షో కి మంచి రేటింగ్ ను తీసుకువచ్చారు. ముఖ్యంగా మోనాల్ అభిజిత్ మరియు మోనాల్ తో నడిపిస్తున్న ట్రయాంగిల్ లవ్ స్టొరీ ఈ సీజన్  లిప్ ఫేమస్ అయింది. కాగా మోనాల్ అబద్ధాలు ఆడుతూ అఖిల్ , అభిజిత్ ల ఆటను చెడగొడుతుంది అంటూ హౌస్ లో మిగతా కంటెస్టెంట్స్ తో పాటు ప్రేక్షకులు కూడా అభిప్రాయ పడుతున్నారు. మోనాల్ ని ఎలిమినేట్ చేయాలంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో మోనాల్ అభిమాని ఒకరు ఆమెకు సహాయం చేయాలంటూ దానకర్ణుడు సోనూసూద్ కు లేఖ రాశారు. 

మోనాల్ అభిమాని లేఖలో...."సోనూసూద్ సార్ మీకు మోనాల్ తెలిస్తే మీరు ఆమెకు సహాయం చేయండి. బిగ్ బాస్ హౌస్ లో మోనాల్ మంచి కంటెస్టెంట్ అయినప్పటికీ ఆమెను జనాలు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. మోనాల్ ఉదయం అఖిల్ తో మాట్లాడుతూ రాత్రి అభిజిత్ తో మాట్లాడుతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. నిజానికి ఆమె ఇద్దరిని మంచి స్నేహితులుగానే చూస్తుంది. అఖిల్ కు త్వరగా పడుకునే అలవాటు ఉండటంతో మోనాల్ రాత్రి అభి తో మాట్లాడుతుంది. ఆమె గుజరాతీ కావడం వల్ల తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. నేను ఇలా కోరుతుంది ఆమె విన్నర్ అవుతుందని కాదు కానీ ఆమె భయటకు వచ్చి ఎంత బాధ పడుతుందో అని ఆలోచిస్తున్నాను. మోనాల్ తెలుగు రాకపోవడంతో ప్రేక్షకులు ఆమె చెప్పేదాన్ని అర్థం చేసుకోలేక అపార్థం చేసుకుంటున్నారు. అందుకే దయచేసి మీరు ఆమెకు మద్దతు ఇవ్వండి."అంటూ మోనాల్ అభిమాని కోరాడు. ఇక అందరికీ సహాయం చేసే సోనూ బాయ్ ఈ వింత రిక్వెస్ట్ కు స్పందిస్తాడో లేదో చూడాలి.

More Related Stories