English   

అవునా.. అజ్ఞాత‌వాసికి అన్ని కోట్లిచ్చారా..?

money return to agnathavasi buyers
2018-05-30 10:40:55

ఈ ఏడాది బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్ ఏంటి..? అదేంటి ఇంకా ఆర్నెళ్లు కూడా కాలేదు అప్పుడే పెద్ద డిజాస్ట‌ర్ ఏంటి అనేది ఎలా చెప్తారు అనుకుంటున్నారా..? ఆ అనుమానాలు ఏవీ అవ‌స‌రం లేదు. ఏడాది మొద‌లైన 15 రోజుల‌కే ఈ ఏడాది అతిపెద్ద డిజాస్ట‌ర్ ఏంటో అర్థ‌మైపోయింది. అదే అజ్ఞాత‌వాసి. అస‌లు నాన్ బాహుబ‌లిలో అంత అంచ‌నాల‌తో విడుద‌లైన ఈ చిత్రం హిట్ అయ్యుంటే కన‌క రికార్డుల‌న్నీ తిర‌గ‌రాసి ఉండేది. కానీ ఫ్లాప్ అయి కూడా అన్నే రికార్డులు తిర‌గ‌రాస్తుంద‌ని ఎవ‌రూ ఊహించ‌లేదు. న‌ష్టాల ప‌రంగా ఇండియాలోనే టాప్ 3 డిజాస్ట‌ర్స్ లో ఒక‌టిగా నిలిచిపోయింది ఈ చిత్రం. ఒక‌టి రెండు కాదు.. దాదాపు 60 కోట్ల‌కు పైగా న‌ష్టాలు తీసుకొచ్చింది ఈ చిత్రం. అయితే అజ్ఞాత‌వాసి విష‌యంలో ప‌వ‌న్ తో పాటు త్రివిక్ర‌మ్ కూడా బాధ్య‌త తీసుకున్నారు. 

ఈ చిత్రం కొని చాలామంది బ‌య్య‌ర్లు దారుణంగా రోడ్డున ప‌డ్డారు. దాంతో వాళ్ల‌ను కాపాడే క్ర‌మంలోనే అప్పుడే ప‌వ‌న్, తాను క‌లిసి 30 కోట్లు ఇచ్చామంటున్నాడు త్రివిక్ర‌మ్. దానికితోడు నిర్మాత కూడా కొంత స‌ర్దుబాటు చేసార‌ని చెబుతున్నాడు. త‌మ‌ను న‌మ్మి తీసుకున్నందుకు తామే బాధ్య‌త తీసుకున్నామ‌ని చెప్పాడు మాట‌ల మాంత్రికుడు. ఈయ‌న ప్ర‌స్తుతం ఎన్టీఆర్ తో అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ లో భాగంగానే అజ్ఞాత‌వాసి ముచ్చ‌ట్ల‌ను కూడా పంచుకున్నాడు త్రివిక్ర‌మ్. మొత్తానికి ఆ అప్పు అలా తీర్చాడు కాబ‌ట్టే ఇప్పుడు మ‌ళ్లీ నిర్భ‌యంగా ఎన్టీఆర్ సినిమాను ఏ టెన్ష‌న్ లేకుండా తెర‌కెక్కిస్తున్నాడేమో..? అక్టోబ‌ర్ లో అర‌వింద స‌మేత విడుద‌ల కానుంది. అజ్ఞాత‌వాసితో పోయిన ప‌రువు.. డ‌బ్బు.. ఇమేజ్ అన్నీ అర‌విందుడు తీసుకొస్తాడ‌ని న‌మ్ముతున్నాడు మాట‌ల మాంత్రికుడు. మ‌రి ఈయ‌న న‌మ్మ‌కం ఎంత‌వ‌ర‌కు నిల‌బ‌డుతుందో చూడాలిక‌..!

More Related Stories