English   

మ‌హాన‌టా మ‌జాకా.. థియేట‌ర్స్ లాగేస్తుంది..!

Mahanati

సావిత్రి మ‌ర‌ణించి 37 ఏళ్లైంది కానీ ఆమెపై అభిమానం మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రికీ ఇంత కూడా త‌గ్గ‌లేదు. దానికి నిద‌ర్శ‌నం ఇప్పుడు మ‌హాన‌టికి వ‌స్తున్న ఆద‌ర‌ణ‌.. వ‌సూళ్లే. కుర్రాళ్లు కూడా సావిత్రి గురించి తెలుసుకోడానికి థియేట‌ర్స్ కు క్యూ క‌డుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు మ‌హాన‌టి కోసం థియేట‌ర్స్ పెంచుతున్నారు.. లేదు లేదు వాళ్లే ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మ‌రో సినిమా ఏదీ క‌నిపించ‌ట్లేదు. రంగ‌స్థ‌లం మ‌రో రెండు మూడు రోజులు అయితే 50 రోజులు అవుతుంది కాబ‌ట్టి ఇప్ప‌టికీ కొన్ని స్క్రీన్స్ అలాగే ఉన్నాయి. ఇక భ‌ర‌త్ అనే నేను కూడా కొన్ని మొండిగా న‌డుపుతున్నారు. అందుకే ఈ వారాంతంలో నా పేరు సూర్య‌తో పాటు మెహ‌బూబా థియేట‌ర్స్ కూడా కొన్ని మ‌హాన‌టికి ఇచ్చేలా అగ్రిమెంట్లు మార్చేసు కుంటున్నారు ఎగ్జిబిట‌ర్లు. మ‌హాన‌టికి ప్రేక్ష‌కులు ఎక్కువ‌గా ఉన్నారు కానీ స‌రైనన్ని థియేట‌ర్స్ లేవు. అందుకే ఈ వారం నుంచి మ‌రో 100 థియేట‌ర్స్ పెంచే ప‌నిలో ఉన్నారు. ఇదే జ‌రిగితే సినిమా క‌లెక్ష‌న్లు మరింత‌గా పెర‌గ‌డం ఖాయం. ఇప్ప‌టికే తొలివారంలో సినిమా 20 కోట్ల షేర్ తీసుకొచ్చింది.. ఈ దూకుడు ఇలాగే సాగితే మ‌రో 20 కోట్లు రావ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

More Related Stories