English   

రేపటి నుంచి మళ్లీ కొత్త సినిమాలు..

movie theater

డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్ వసూలు చేస్తోన్న చార్జీలను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని రోజులుగా ఫిల్మ్ చాంబర్, ఎగ్జిబిటర్స్, చేస్తోన్న థియేటర్స్ బంద్ ముగిసింది. ఈ మేరకు డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్, చాంబర్ కు మధ్య జరుగుతున్న చర్చలు ఫలించాయి. బంద్ మొదటి నుంచి సర్వీస్ చార్జ్ ను ఎత్తివేయాలనే డిమాండ్ తో ఉన్నారు ఎగ్జిబిటర్స్. కానీ అలా చేయడం సాధ్యం కాదని ఖచ్చితంగా చెప్పారు సర్వీస్ ప్రొవైడర్స్ .. ఈ నేపథ్యంలో మొదలైన బంద్ మొత్తంగా ముగిసింది. వీరి మధ్య జరుగిన చర్చల ఫలితంగా 17శాతం సర్వీస్ చార్జ్ తగ్గించేందుకు ప్రొవైడర్స్ ఒప్పుకున్నారు.

ఇక ఇప్పటి వరకూ తెలుగు రాష్ట్రాల్లో డిజిటల్ స్క్రీనింగ్ ను శాసిస్తోన్న క్యూబ్, విఎఫ్ఎక్స్, పిఎక్స్ల్ఎల్ సంస్థలు ఎగ్జిబిటర్ల డిమాండ్ కు చాలా వరకూ తలొంచాయి. కానీ చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆ సర్వీస్ చార్జ్ ను పూర్తిగా తొలగించాలి. కానీ పెరిగిన ఖర్చుల నేపథ్యలో అలా చేయడం సాధ్యం కాదని వీరు చెబుతున్నారు.అందుకే మొదట్లో 9 శాతం నుంచి మొదలైన చర్చలు ఫైనల్ గా 17శాతం ఒప్పందంతో ముగిసిపోయాయి. దీనికి సంబంధించి  పూర్తిస్థాయి అగ్రిమెంట్స్ కూడా అయిపోయాయి. అలాగే రాబోయే కాలంలో మళ్లీ ఇలాంటి సమస్యలు తలెత్తకుండా కొత్తగా మరికొన్ని అగ్రిమెంట్స్ కూడా వీరి మధ్య కుదిరే అవకాశం ఉంది. మొత్తంగా చాంబర్ నుంచి 25శాతం ఎత్తివేయాలనే డిమాండ జరిగింది. కానీ ఫైనల్ గా 17శాతానికి ఒప్పందం కుదిరింది. దీంతో ఇక రేపటి నుంచి థియేటర్స్ ఓపెన్ అవుతున్నాయి.

మొత్తంగా ఈ నెల 2నుంచి నిరవధికంగా జరుగుతోన్న బంద్ విజయవంతంగా ముగిసిందనే చెప్పొచ్చు. గత వారం కొత్త సినిమాలు లేక, పాత సినిమాలు ప్రదర్శించే వీలు లేక థియేటర్స్ వెలవెలబోయాయి. ఇక బంద్ ముగిసింది కాబట్టి రేపటి నుంచి మళ్లీ కొత్త సినిమా పోస్టర్స్ తో కళకళలాడతాయి. ఈ మేరకు బుక్ మై షోలో కూడా ఆల్రెడీ టికెట్స్ ఓపెన్ చేసి ఉంచారు.. సో బంద్ కు శుభం కార్డ్ పడిందన్నమాట.

More Related Stories