English   

బయ్యర్లకు నష్టాన్ని మిగిల్చిన mr.మజ్ను !

Akhil
2019-02-05 03:50:22

అక్కినేని అఖిల్ హీరోగా నటించిన మిస్టర్ మజ్ను అనుకున్నంత సక్సెస్ సాధించకపోవడంతో ఆ సినిమా బయ్యర్లకు 9 కోట్ల మేర నష్టాన్ని మిగిల్చిందని ట్రేడ్ వర్గాల సమాచారం. జనవరి 25న విడుదలైన మిస్టర్ మజ్ను చిత్రానికి మొదటి ఆట నుండే డివైడ్ టాక్ వచ్చింది దాంతో పెద్దగా వసూళ్ల ని సాధించలేకపోయింది. ఈ సినిమా యూనిట్ ఆలస్యంగా మేల్కొని, మిస్టర్ మజ్ను ఆడుతున్న థియేటర్లలో పర్యటించింది, కానీ అది అప్పటికే ఆలస్యమైంది. అయితే గుడ్డి కంటే మెల్ల నయం అన్న చందాన ఈ సినిమా 11కోట్ల షేర్ రాబట్టింది దాంతో బయ్యర్లకు 9 కోట్ల నష్టం వాటిల్లింది. అయితే నిర్మాతకు పెద్దగా నష్టాలు రాలేదు పైగా సినిమాని ముందే అమ్ముకున్నాడు కాబట్టి. ముందుగా అమ్ముకోవడంలో బాగానే గిట్టుబాటు అయ్యింది. కానీ నష్టపోయింది మాత్రం బయ్యర్లే. ఈసినిమాకి 20 కోట్ల బిజినెస్ జరిగితే తిరిగి వచ్చింది మాత్రం 11 కోట్లు మాత్రమే అని సమాచారం. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అఖిల్ సరసన నిధి అగర్వాల్ నటించింది. అఖిల్ నటించిన మూడు సినిమాలు కూడా ప్లాప్ కావడంతో అక్కినేని ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. అయితే దర్శకుడు మాత్రం మిస్టర్ మజ్ను  చిత్రానికి ఆడియన్స్ లో మంచి మౌత్ టాక్ వచ్చిందని రివ్యూలలో మాత్రం విమర్శలు వచ్చాయని కానీ సినిమాలోని కామెడీని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు కలెక్షన్లు మాత్రం సినిమా రిజల్ట్ ని ఇలా బయట పెట్టేశాయి.

More Related Stories