English   

పెళ్లి చూపులు జ్ఞానేశ్వరి...మిస్ అయ్యిందా ?

Mr-Miss
2019-02-11 20:25:01

గతంలో మా టీవీలో ప్రసారమైన పెళ్లి చూపులు రియాల్టీ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న జ్ఞానేశ్వరి కండ్రేగుల హీరోయిన్ అయిపోయింది. ప్రదీప్‌తో పెళ్లి వార్తతో ఒక్కసారిగా లైం లైట్ లోకి వచ్చిన ఈ భామ ఇప్పుడు ‘మిస్టర్ & మిస్’ టీజర్‌ తో హల్చల్ చేస్తోంది. ‘మిస్టర్ & మిస్’ సినిమా టీజర్ ఈ మధ్యనే రిలీజ్ చేశారు. పెద్దగా ఇంటరెస్టింగ్ ఫాక్టర్స్ ఏమీ లేనప్పటికీ టీజర్ మొదటిలోనే ముద్దు సీనుతో వేడి పెంచేసాడు కొత్త డైరెక్టర్ అశోక్ రెడ్డి. నిజానికి తెలుగులో ‘అర్జున్ రెడ్డి’ సినిమా తర్వాత ముద్దులు షరా మామూలు అయిపోయాయి. జ్ఞానేశ్వరి లీడ్ గా నటిస్తున్న ‘మిస్టర్ & మిస్’ సినిమా కూడా ఆ కోవకు చెందినదే. అయితే, ఈ టీజర్‌లో జ్ఞానేశ్వరిని చాలా అందంగా చూపించారు. ఏమిటో అడగదు స్నేహం దేనికో తెలపదు దూరం అంటూ బ్యాక్ గౌండ్ లో వచ్చే పాట బాగుంది. రీ కలెక్ట్ యువర్ మెమరీస్ టు అవాయిడ్ బ్రేకప్స్ అనే కొటేషన్‌తో టీజర్ ముగుస్తుంది. అయితే ఈ సినిమా సెల్ఫీ వీడియోలతో తమ జీవితంలోని ప్రతి మూవ్‌మెంట్‌ను క్యాప్చర్ చేసుకోనే అలవాటు ఉన్న ఇద్దరినీ బేస్ చేసుకుని తీసిన సినిమా అని అంటున్నారు. రీడింగ్ ల్యాంప్ క్రియేషన్ బ్యానర్‌ లో క్రౌడ్ ఫండింగ్ ద్వారా నిర్మిస్తున్న ఈ సినిమా హైదరాబాద్ లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఫిబ్రవరి 14న వాలంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమా మొదటి పాటను విడుదల చేయనున్నారని చెబుతున్నారు. జ్ఞానేశ్వరి కండ్రేగులకు జంటగా శైలేష్ సన్నీ నటిస్తున్నాడు. ఈ చిత్రానికి యశ్వంత్ నాగ్ సంగీతం అందించారు. అందరూ కొత్త వారే చేస్తున్న ఈ సినిమా ఏమేరకు విజయం సాదిస్తుందో వేచి చూడక తప్పదు. 

More Related Stories