English   

నమ్రత పోస్ట్ పై హర్ట్ అయిన నిర్మాత..మహేష్ కు తెలిసేలా ట్వీట్

MS Raju
2021-01-16 14:25:26

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో "ఒక్కడు" బిగ్గెస్ట్ హిట్ అని చెప్పొచ్చు. ఈ సినిమాతో అప్పటివరకు లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న మహేష్ బాబు మాస్ ఆడియన్స్ కు దగ్గరయ్యారు. సినిమాలోని పాటలు, డైలాగులు ఇప్పటికీ జనాల నోర్లలో నానుతుంటాయి. ఇక అప్పట్లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి శుక్రవారం నాటికి (15-01-2021) 18 ఏళ్ళు పూర్తయ్యింది. ఈ సందర్భంగా  మహేష్ సతీమణి నమ్రత తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఓ పోస్ట్ చేసింది. “మహేష్ సినిమాల్లో ఒక్కడు ఒక క్లాసిక్‌ సినిమా. ఇది మళ్లీ మళ్లీ చూడలనిపించే సినిమా.. ఒక్కడు నాకు ఆల్‌ టైమ్‌ ఫేవరేట్‌ సినిమా. కాలంతో పాటు ఈ సినిమా వన్నె ఇంకా పెరుగుతూనే ఉంది” అంటూ పోస్ట్ లో పేర్కొంది. 

కాగా ఇప్పుడు ఈ పోస్ట్ చర్చకు దారితీస్తోంది. నమ్రత ఈ పోస్ట్ ను నటి భూమిక, దర్శకుడు గుణశేఖర్, ప్రకాష్ రాజ్, ఫైట్ మాస్టర్ విజయన్ లను టాగ్ చేసింది. కానీ సినిమాకు మూలమైన నిర్మాత ఎమ్ఎస్ రాజు పేరును మాత్రం మర్చిపోయింది. దీనిపై హర్ట్ అయ్యిన ఎమ్ఎస్ రాజు ట్విట్టర్ లో ఓ పోస్ట్ చేసారు. “పొరపాట్లు జరుగుతుంటాయి బాబు. నమ్రతగారు ఒక్కడు గురించి మాట్లాడుతూ నా పేరును మర్చిపోయారు. అయినా నాకు సంతోషమే. ఈ సినిమా ఆమెకు ఫెవరెట్ మూవీ. గుడ్” అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. అంతే కాకుండా ఈ ట్వీట్ ను మహేష్ బాబుకు టాగ్ చేసారు. ఇక దీనిపై మహేష్ బాబు, నమ్రత ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి. 

More Related Stories