English   

మురుగ‌దాస్ ను వ‌దిలించుకుంటున్న మ‌హేశ్.. 

Murugadoss-Nu-Vadilinchukutunna-Mahesh 
2017-05-10 08:24:09

మురుగ‌దాస్ సినిమాను ఎంత త్వ‌ర‌గా వీలైతే అంత త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని చూస్తున్నాడు మ‌హేశ్ బాబు. ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లోనే జ‌రుగుతుంది. ఇక్క‌డే కొన్ని కీల‌క‌మైన స‌న్నివేశాలు తెర‌కెక్కిస్తున్నాడు ద‌ర్శ‌కుడు మురుగ‌దాస్. ఈ సినిమాపై ముందు నుంచి చాలా ఆస‌క్తిగా ఉన్నాడు మ‌హేశ్ బాబు. కానీ షూటింగ్ జ‌రుగుతున్న కొద్దీ మురుగ‌దాస్ సినిమాపై మ‌హేశ్ కు ఆస‌క్తి త‌గ్గి.. చిరాకు పెరిగింద‌ని తెలుస్తోంది. దానికి కార‌ణం మురుగ‌దాస్ ప‌ర్ ఫెక్ష‌న్. తీసిందే తీసి.. మ‌ళ్లీమ‌ళ్లీ తీసి అన‌వ‌స‌రంగా టైమ్ వేస్ట్ చేస్తున్నాడ‌ని మురుగ‌దాస్ పై మ‌హేశ్ కాస్త కోపంగా ఉన్నాడ‌ని తెలుస్తోంది. స్పైడ‌ర్ షూటింగ్ ను రెండు వారాల్లో పూర్తి చేయాల‌ని మురుగ‌దాస్ కు మ‌హేశ్ వార్నింగ్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.

ప‌ర్ ఫెక్ష‌న్ పేరు చెప్పి మురుగ‌దాస్ చూపిస్తోన్న టార్చ‌ర్ మ‌హేశ్ త‌ట్టుకోలేక‌పోతున్నాడ‌ని ఈ సినిమాకు ప‌ని చేస్తున్న వాళ్లే చెప్పుకుంటున్నారు. ఇక మ‌హేశ్ కూడా వీలైనంత త్వ‌ర‌గా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి కొర‌టాల శివ‌తో జ‌త క‌ల‌వాల‌ని చూస్తున్నాడు. ఇప్ప‌టికే ఆ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా మొద‌ల‌య్యాయి. గత రెండు నెల‌లుగా క‌థ సిద్ధం చేసుకుని కేవ‌లం మ‌హేశ్ కోసం వేచి చూస్తున్నాడు కొర‌టాల శివ‌. ఇది పొలిటిక‌ల్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్క‌నుంది. భ‌ర‌త్ అను నేను టైటిల్ కూడా క‌న్ఫ‌ర్మ్ చేసాడు కొర‌టాల. సినిమా సినిమాకు మ‌ధ్య కొన్ని రోజులు గ్యాప్ తీసుకునే మ‌హేశ్.. ఈ సారి ఆ హాలీడేస్ కూడా త్యాగం చేస్తున్నాడ‌ని తెలుస్తోంది. అన్నీ కుదిర్తే మే 18 నుంచి కొర‌టాల సినిమాతో జాయిన్ కానున్నాడు మ‌హేశ్ బాబు. మొత్తానికి మురుగ‌దాస్ బారి నుంచి సూప‌ర్ స్టార్ ఎప్పుడు బ‌య‌ట‌పడ‌తాడో చూడాలిక‌.

More Related Stories