English   

రాహుల్ గాంధీ బ‌యోపిక్ రాగా టీజ‌ర్....కలిసొస్తుందా ? 

Rahul-Gandhi
2019-02-11 16:49:58

ప్ర‌స్తుతం అన్ని బాషలలో బ‌యోపిక్‌ల సీజ‌న్ న‌డుస్తుంది. రాజ‌కీయ నాయ‌కుల జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కిన ప‌లు సినిమాలు ఇటీవ‌ల విడుద‌ల కాగా, మ‌రి కొన్ని సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. భార‌త ప్ర‌ధాని మోడీ జీవిత నేప‌థ్యంలోను బ‌యోపిక్ రూపొందిస్తున్న‌ట్టు ఇటీవ‌ల ప్ర‌క‌టించ‌గా, మాజీ ప్రధాని మన్మోహన్ బయోపిక్ రిలీజ్ కూడా అయ్యింది. ఇక ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ జీవితంపై ఓ బ‌యోపిక్ రూపొందుతుంది. మై నేమ్ ఈజ్ రాగా అనే టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో ఇందులో రాహుల్ గాంధీ వ్య‌క్తిగ‌త‌, రాజ‌కీయ జీవితాన్ని ఎమోషనల్ టచ్ తో చూపించ‌నున్నారు. కామ‌సూత్ర లాంటి సినిమా తెర‌కెక్కించిన పాల్ రూపేష్ ద‌ర్శ‌క‌త్వంలో మై నేమ్ ఈజ్ రాగా సినిమా తెర‌కెక్క‌నుండ‌గా, సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్ ని తాజాగా విడుద‌ల చేశారు. ఇందులో ఇందిరా గాంధీ నుండి రాహుల్ కుటుంబాన్ని చూపిస్తూ రాహుల్ రాజ‌కీయ ఆరంగేట్రం వెనక జ‌రిగిన ఘటనలను చూపించారు. ఇక మేము క్రియాశీల రాజకీయాల్లో ప్రియాంక ప్రవేశాన్ని చివ‌రి సీన్‌గా షూట్ చేస్తామ‌ని రూపేష్ అన్నారు. 2019 ఎల‌క్షన్స్‌కి ముందు ఈ సినిమాని ప్రేక్ష‌కుల ముందుకు తేనున్నారు. రాహుల్ కన్ను కొట్టడం దగ్గర నుండీ, ప్రతీ అంశాన్ని తెర మీద చూపనున్నాడు. మ‌రి ఈ సినిమా ఓటర్లపై ఏ మేరకు ప్రభావం చూపిస్తుందో. 

More Related Stories