English   

మమ్మూట్టిని రేప్ చేస్తా అన్నాడు

Mysskin

పొగడ్తలు ఎప్పుడూ బానే ఉంటాయి. కానీ శ్రుతి మించిన పొగడ్తలే తేడా కొడతాయి. తేడాగా అనిపిస్తాయి. లేటెస్ట్ గా ఓ తమిళ దర్శకుడు చేసిన వ్యాఖ్యలు అప్పటికి బానే అనిపించినా.. ఆ తర్వాత తీవ్ర విమర్శల పాలవుతున్నాయి. ఆ దర్శకుడు మిస్కిన్. వైవిధ్యమైన సినిమాలు తీస్తాడనే పేరున్న తమిళ దర్శకుడు మిస్కిన్. లేటెస్ట్ గా మళయాలంలో లేటెస్ట్ సెన్షేషన్ గా సినిమా పెరాన్బు. మమ్మూట్టి హీరోగా నటించిన సినిమా ఇది. ఇంకా సినిమా విడుదల కాలేదు. కానీ అప్పుడే ఇది నేషనల్ అవార్డ్స్ కొట్టబోతోన్న సినిమా అంటూ విపరీతమైన ప్రచారం జరుగుతోంది. దీంతో మాగ్జిమం భాషల్లోకి ఈ చిత్రాన్ని అనువదించాలనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో లేటెస్ట్ గా తమిళ్ లో టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ లాంచింగ్ కు ముఖ్య అతిథుల్లో ఒకడిగా హాజరైన మిస్కిన్.. కాస్త శ్రుతి మించిన పొగడ్తలు చేసి విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

ఇక పెరాన్బు గురించి మిస్కిన్ చెప్పిన మాటలు చూస్తే.. ‘ఈ సినిమాలో మమ్మూట్టి తప్ప ఎవరూ నటించలేరు. ఆయన కాకుండా ఎవరు నటించినా ఈ సినిమా ఆడదు. అంత అద్భుతంగా నటించాడాయన. ఆయన నటనకు ఎంటైర్ ఆడియన్స్ ఫిదా అయిపోతారు. ఈ సినిమాలో ఆయన నటనను నేను ఎంత ప్రేమిస్తున్నానంటే.. ఒకవేళ మమ్మూట్టి గనక అమ్మాయిగా పుట్టి ఉంటే తనను నేను రేప్ చేసేవాడిని’ అంటూ తన అభిమానాన్ని హద్దులు దాటి ప్రవర్తించాడు. ఆ టైమ్ లో అంతా అతని మాటలను ఎంజాయ్ చేసినా..ఆ తర్వాత సోషల్ మీడియలో మనోడిపై తెగ సెటైర్స్ వేస్తున్నారు. ట్రోలింగ్ చేస్తున్నారు. అసలే రేప్ ల భారతం అంటూ ఓ వైపు ప్రపంచం మొత్తుకుంటుంటే.. బాధ్యత గల పొజిషల్ లో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తావా అంటూ దుమ్మెత్తిపోస్తున్నారు.. మరి ఈ ట్రోలింగ్స్ పై మిస్కిన్ ఎలా స్పందిస్తాడో చూడాలి. 

More Related Stories