English   

అనుకు అన్యాయం చేస్తున్న అల్లుఅర్జున్..

anu emmanuel
2018-03-07 17:04:47

అస‌లే కెరీర్ ఎటు పోతుందో తెలియ‌ని ప‌రిస్థితుల్లో ఉంది అను ఎమ్మాన్యువ‌ల్. ఆశ‌లు పెట్టుకున్న అజ్ఞాత‌వాసి కాస్తా కెరీర్ ను మ‌రింత అజ్ఞాతంలోకి తీసుకెళ్లాడు. ఇక ఆక్సీజన్ అందకుండానే ఆవిరైపోయింది. ఇలాంటి టైమ్ లో అను ఎమ్మాన్యువ‌ల్ కెరీర్ గాడిన ప‌డాలంటే ఉన్న ఒకే ఒక్క ఆశ నా పేరు సూర్య‌. అల్లుఅర్జున్ లాంటి స్టార్ హీరోతో న‌టిస్తుండ‌టంతో ఈ సినిమా త‌న కెరీర్ కు బాగానే హెల్ప్ అవుతుంద‌నే ఊహ‌ల్లో ఉంది ఈ ముద్దుగుమ్మ‌. కానీ ఇప్పుడు ఇది కూడా షాక్ ఇచ్చేలా క‌నిపిస్తుంది. దానికి కార‌ణం సినిమా క‌థ‌. అవును.. నా పేరు సూర్య పూర్తిగా ఆర్మీ నేప‌థ్యంలో సాగే క‌థ‌. ఇందులో రొమాన్స్ కు పెద్ద‌పీట వేస్తే అస‌లుకే మోసం వ‌స్తుంద‌ని భావిస్తున్నాడు బ‌న్నీ.

అందుకే ఈ మ‌ధ్యే ఓ సారి ర‌ష్ చూసిన అల్లుఅర్జున్.. రొమాంటిక్ సీన్స్ అన్నీ చాలా వ‌ర‌కు నిర్ధాక్ష‌ణ్యంగా కోసేయాల‌ని చెప్పాడ‌ని తెలుస్తుంది. క‌థ ఫ్లోను డిస్ట‌ర్బ్ చేసే ఏ సీన్స్ సినిమాలో ఉండాల్సిన అవస‌రం లేద‌ని చెప్పిన‌ట్లు తెలుస్తుంది. ద‌ర్శ‌కుడు వక్కంతం వంశీతో మాట్లాడి 1 గంట 15 నిముషాలున్న ఫస్టాఫ్ ని ఎడిట్ చేస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదే జ‌రిగితే అను ఎమ్మాన్యువ‌ల్ కెరీర్ కు పెద్ద షాకే. ఇప్పటి వ‌ర‌కు ఈ భామ కెరీర్ గాడిన ప‌డేంత సినిమా ఒక్క‌టి ప‌డ‌లేదు. మ‌జ్ను చేసినా అందులో క్రెడిట్ అంతా నాని తీసుకెళ్లిపోయాడు. దాంతో నా పేర‌రు సూర్య‌పైనే ఆశ‌లు పెట్టుకున్న అనుకు ఇది ఓ ర‌కంగా కోలుకోలేని షాక్. మే 4న నా పేరు సూర్య.. నా యిల్లు ఇండియా విడుద‌ల కానుంది. మ‌రి చూడాలిక‌.. విడుద‌ల త‌ర్వాత ప‌రిస్థితి ఎలా ఉండ‌బోతుందో..?

More Related Stories