English   

రేపే విడుద‌ల‌.. అయినా బజ్ లేదేలా..?

naa nuvve
2018-06-13 17:33:43

కొన్ని సినిమాల‌కు అంతే. స‌పోర్ట్ ఉంటుంది. స‌త్తా  కూడా ఉండే చాన్స్ ఉంటుంది. కానీ కావాల్సినంత బ‌జ్ ఉండ‌దు.  ప్ర‌స్తుతం క‌ళ్యాణ్ రామ్, త‌మ‌న్నా జంట‌గా న‌టించిన  నా నువ్వే ప‌రిస్థితి ఇదే. గ‌త నెల 25నే విడుద‌ల  కావాల్సిన ఈసినిమా రేపు విడుద‌ల కాబోతోంది. అయినా అప్పుడే కాదు.. ఇప్పుడూ పెద్ద‌గా బ‌జ్ లేదు. కొంత గ్యాప్ తీసుకుని.. కొంత రీ షూట్ చేసుకుని.. రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా తీసుకువ‌చ్చినా.. నా నువ్వేపై క్రేజ్ రావ‌డం లేదు. ఇంక మ‌రికొన్ని గంట‌ల్లోనే సినిమా విడుద‌ల‌వుతుంది. అయిన ఆ క్రేజ్ కనిపించ‌డం లేదు. 

క‌ళ్యాణ్ రామ్, త‌మ‌న్నా మొద‌టి సారి క‌లిసి న‌టించిన సినిమా ఇది. మోస్ట్ టాలెంటెడ్ అని చెప్పే జ‌యేంద్ర ద‌ర్శ‌కుడు. నేష‌న‌ల్ వైడ్ గా మోస్ట్ ఫేమ‌స్ అయిన పిసి శ్రీరామ్ సినిమాటోగ్ర‌ఫీ అందించాడు. ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్ బావున్నాయి. అయినా పెద్ద‌గా మాట్లాడుకోవ‌డం లేదీ సినిమా గురించి. బ‌ట్ క‌ళ్యాణ్ రామ్ కు ఇది కీల‌క‌మైన సినిమా. ఈ సినిమా హిట్ అయితే ఆ నిర్మాత‌కు ఎన్టీఆర్ డేట్స్ ఇచ్చే అవ‌కాశ‌మూ ఉంది.మ‌రికొన్ని గంట‌ల్లో ఆడియ‌న్స్ ముందుకు రాబోతోన్న నా నువ్వే ఎలాంటి రిజ‌ల్ట్ ను అందుకుంటుందో చూడాలి. 

More Related Stories