English   

నా నువ్వే ఫ‌స్ట్ షో టాక్..!

Naa Nuvve

 

పిసి శ్రీ‌రామ్ సినిమాటోగ్ర‌ఫీ.. త‌మ‌న్నా హీరోయిన్.. క‌ళ్యాణ్ రామ్ మేకోవ‌ర్.. ఇవ‌న్నీ క‌లిపి నా నువ్వే సినిమాను ఎందుకో కాస్త స్పెష‌ల్ గా మార్చేసాయి. ఎన్టీఆర్ కూడా ఈ లుక్స్ చూసి ఫిదా అయిపోయాడు. అన్నయ్య మారిపోయిన తీరుకు ఆనందించాడు. ఇక ఇప్పుడు ఈ చిత్రం విడుద‌లైంది. నా నువ్వే ఓవ‌ర్సీస్ షోలు ప‌డిపోయాయి. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిన టాక్ ప్ర‌కారం చూస్తుంటే సినిమా పెద్ద‌గా ఏం లేద‌ని.. మ‌రోసారి పాత క‌థ‌నే తీసుకుని జయేంద్ర కొత్త సీసాలో పోయ‌డానికి చూసాడంటున్నారు ప్రేక్ష‌కులు. మ‌రీ ముఖ్యంగా సోల్ లేకుండా రొమాన్స్ అనేది క‌ష్టంగా మారిందంటున్నారు ఆడియ‌న్స్. క‌ళ్యాణ్ రామ్ మేకోవ‌ర్ బాగానే ఉన్నా.. త‌మ‌న్నా అందాలు అల‌రించినా.. పిసి శ్రీ‌రామ్ కెమెరా ప‌నిత‌నం అద్భుతంగా ఉన్నా ద‌ర్శ‌కుడు జ‌యేంద్ర మాత్రం నిరాశ ప‌రిచాడంటున్నారు. ఈయ‌న క‌థ విష‌యంలో ఇంకాస్త జాగ్ర‌త్త‌లు తీసుకుని ఉండుంటే బాగుండేది అంటున్నారు ప్రేక్ష‌కులు. ముఖ్యంగా ఎక్క‌డా స‌రైన క‌నెక్టింగ్ పాయింట్ లేకుండా క‌థ ముందుకు వెళ్తుంద‌ని.. డెస్టినీ బేస్ చేసుకుని క‌థ రాసుకున్న ద‌ర్శ‌కుడు దాన్ని ప్ర‌జెంట్ చేయ‌డంలో మాత్రం థ్రెడ్ మిస్ అయ్యాడంటున్నారు. మొత్తానికి చూడాలిక‌.. ఓవ‌ర్సీస్ లో అయితే బిల్ యావ‌రేజ్ టాక్ తోనే ఓపెన్ అయింది నా నువ్వే. మ‌రి ఇక్క‌డ ఈ సినిమా ప‌రిస్థితి ఎలా ఉండ‌బోతుందో..?

More Related Stories