English   

నా నువ్వేపై ఎన్టీఆర్ కు న‌మ్మ‌కం లేదా..?

naa nuvve ntr
2018-06-12 01:09:25

ఏంటి.. స‌డ‌న్ గా ఈ ప్ర‌శ్న ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు..? అయినా అన్న‌య్య సినిమాపై ఎన్టీఆర్ కు ఎందుకు న‌మ్మ‌కం ఉండ‌దు అనుకుం టున్నారా..? ఏమో ఇప్పుడు ఈయ‌న ప్రీ రిలీజ్ వేడుక‌లో మాట్లాడిన తీరు చూస్తుంటే అంద‌రికీ ఇదే అనుమానం రాక మాన‌దు. ఇలాంటి సినిమాలు చేయాలంటే ముందు ధైర్యం ఉండాలి.. అస‌లు హిట్ ఫ్లాపుల‌తో ప‌ని లేకుండా ప్ర‌య‌త్నం ముందు చేయాలి.. కొత్త‌గా ట్రై చేసిన‌పుడు టెన్ష‌న్ ఉంటుంది  అంటూ మాట్లాడేసాడు నంద‌మూరి వార‌సుడు. ఇవ‌న్నీ చూస్తుంటే సినిమా ఎలా ఉంటుందో ముందే అర్థ‌మైపోతుంది. ప్రేక్ష‌కుల మైండ్స్ ను ముందే ప్రిపేర్ చేసిన‌ట్లు అనిపిస్తుంది. సినిమాలో క‌ళ్యాణ్ రామ్ ను కొత్త‌గా ఊహించుకోండి.. ఇది మీరు అనుకుంటున్న‌ట్లు అయితే ఉండ‌దు.. పూర్తి కొత్త‌గా జ‌యేంద్ర ట్రై చేసాడు అని ఎన్టీఆర్ చెప్పిన‌ట్లుంది. పైగా క‌థ కూడా రొటీన్ గా ఉండ‌దంటుంటే క‌చ్చితంగా జ‌యేంద్ర తొలి సినిమా 180 త‌ర‌హాలో ఇది కూడా స్యాడ్ ఎండింగ్ అవుతుందేమో అనిపిస్తుంది. మొత్తానికి చూడాలిక‌.. క‌ళ్యాణ్ రామ్ ఈ చిత్రంతో ఎంత కొత్త‌గా ట్రై చేసాడో..? మ‌రో మూడ్రోజుల్లో ఈ చిత్రం విడుద‌ల కానుంది. జూన్ 13నే యుఎస్ ప్రీమియ‌ర్స్ భారీగానే ప‌డుతున్నాయి. 

More Related Stories