English   

నా నువ్వే రివ్యూ

Naa Nuvve Review
2018-06-14 13:13:48

నా నువ్వే.. ఈ మ‌ధ్య కాస్త ఫ్రెష్ ఫీలింగ్ తెప్పించిన సినిమా ఇది. క‌ళ్యాణ్ రామ్ పూర్తిగా మేకోవ‌ర్ అయి కొత్త‌గా క‌నిపించాడు. టీజ‌ర్.. ట్రైల‌ర్ కూడా కొత్త‌గా ఉంటుంద‌నే భ‌రోసా ఇచ్చాయి. మ‌రి నిజంగానే క‌ళ్యాణ్ రామ్ అంత కొత్త క‌థ చూపించాడా..? ఇంత‌కీ నా నువ్వే ఎలా ఉంది..?

క‌థ‌: వ‌రుణ్ (క‌ళ్యాణ్ రామ్) స్ట‌డీస్ పూర్తి చేసుకుని యుఎస్ కు జాబ్ చేయ‌డానికి వెళ్ళాల‌నుకుంటాడు. కానీ అనుకోని కార‌ణాల‌తో ఫ్లైట్ మిస్ అవుతాడు. ఓ రైల్వే స్టేష‌న్ లో ఉన్న‌పుడు మీరా(త‌మ‌న్నా) ను త‌న‌కు తెలియ‌కుండానే క‌లుస్తాడు. అది వ‌రుణ్ కు యాక్సిడెంట‌ల్ మీటింగ్ అయినా మీరాకు మాత్రం వ‌రుణ్ ల‌క్కీ ఛామ్ అయిపోతాడు. తెలియ‌కుండానే అత‌డు ప్రేమికుడు అయిపోతాడు. అత‌డి వ‌ల్లే ఆర్జేగా మీర‌కు జాబ్ వ‌స్తుంది. దాంతో త‌న ల‌క్కీ ఛామ్ ను వెత‌క‌డం మొద‌లుపెడుతుంది. ఓ సారి క‌లిసి.. మ‌ళ్లీ విడిపోతారు ఈ జంట‌. అప్ప‌ట్నుంచీ ఎలా క‌లుసుకున్నారు అనేది మిగిలిన క‌థ‌. 

క‌థ‌నం: క‌ళ్యాణ్ రామ్ నుంచి మ‌నం మాస్ సినిమాలు ఊహించొచ్చు కానీ ప్రేమ‌క‌థ‌లు మాత్రం కాదు. అప్పుడెప్పుడో కెరీర్ తొలి రోజుల్లో తొలి చూపుల‌నే అంటూ ఓ ప్రేమ‌కథ ట్రై చేసాడు క‌ళ్యాణ్. అది కూడా ఎవ‌రూ ఊహించ‌ని విధంగా కొత్త క‌థ ట్రై చేసాడు. కేవ‌లం త‌న వ‌ర‌కు మాత్ర‌మే. ప్రేక్ష‌కులకు మాత్రం ఇది ప‌ర‌మ రొటీన్ క‌థే. ఇద్ద‌రు ప్రేమికులు విడిపోవ‌డం.. ఆ త‌ర్వాత మ‌ళ్లీ క‌ల‌వ‌డం.. ఎలా క‌లిసారో చూపించ‌డం అనే క‌థ‌తో చాలా సినిమాలు వ‌చ్చాయి. ఇప్పుడు నా నువ్వే కూడా అదే క‌థ‌. తొలి సీన్ లోనే త‌మ‌న్నా ఏడుస్తూ క‌నిపించ‌డం.. విడిపోయిన ప్రేమ కోసం వెతుకుతుండ‌టం.. అంత‌లోనే ఫ్లాష్ బ్యాక్.. ఓ బుక్.. అది మ‌ళ్లీ మ‌ళ్లీ య‌మ‌దొంగ‌లో ఎన్టీఆర్ ను వెంటాడే బిల్ల‌లా త‌మ‌న్నాను వెంటాడ‌టం.. ఇవ‌న్నీ చ‌కా చ‌కా జ‌రిగిపోతాయి. ఇదేదో కాస్త ఆస‌క్తిక‌రంగానే ఉందే అనుకునే లోపు అక్క‌డ్నుంచి మొద‌ల‌వుతుంది మోత‌. ఎంత‌సేప‌టికి గ‌చ్చులో ఉన్న నీళ్ల‌లా అక్క‌డే సుడిగుండాలు తిరుగుతూనే ఉంటుంది క‌థ‌. ఎంత డైజెస్ట్ చేసుకోవాల‌నుకున్నా కూడా ఆ డెస్టినీని అర్థం చేసుకోవ‌డం సాధ్యం కాదు. మ‌నం డెస్టినీ అనుకుని స‌ర్ది చెప్పుకున్నా కూడా మ‌రీ ఇంత‌గా ఉంటుందా అనేది న‌మ్మ‌లేం. హీరో హీరోయిన్ మ‌ధ్య ప్రేమ పుట్ట‌డానికి కూడా పెద్ద‌గా కార‌ణాలుండ‌వు. వ‌ర్షం సినిమాలో ప్ర‌భాస్, త్రిష‌లా డెస్టినీ అంటారంతే. ఆ త‌ర్వాత వాళ్లు క‌లుసుకునే తీరు కూడా పెద్ద‌గా ఆస‌క్తిక‌రంగా అనిపించ‌దు. రెండు గంట‌ల సినిమా కూడా ప్రేక్ష‌కుల స‌హ‌నానికి ప‌రీక్ష పెడుతుందంటే ఎలా సాగుతుందో అర్థం చేసుకోవ‌చ్చు. 

న‌టీన‌టులు: క‌ళ్యాణ్ రామ్ కొత్త‌గా ఉన్నాడు.. అందులో అనుమానం లేదు. న‌ట‌న కూడా బాగానే ఉంది. అయితే ప్రేమ‌క‌థ‌కు ఇప్పుడు క‌ళ్యాణ్ సెట్ కాలేదు. గెట‌ప్ మార్చేసాడు కానీ ఆయ‌న జీన్స్ ఎక్క‌డికి పోతుంది. త‌మ‌న్నా ఉన్నంతలో బాగా చేసింది. అందంగా అందంతో మ‌రిపించింది. హీరో స్నేహితులుగా ప్ర‌వీణ్, వెన్నెల కిషోర్ ప‌ర్లేదు. అప్పుడ‌ప్పుడూ న‌వ్వించే బాధ్య‌త వెన్నెల తీసుకున్నాడు. ఇక పోసాని, త‌ణికెళ్ల భ‌ర‌ణి కూడా ఉన్నంతలో బానే చేసారు. 

టెక్నిక‌ల్ టీం: పిసి శ్రీ‌రామ్ సినిమాటోగ్ర‌ఫీ గురించి చెప్ప‌డానికేం లేదు. ఆయ‌న వ‌ర్క్ గురించి చెప్పే స్థాయి కూడా మ‌న‌ది కాదు. ఆయ‌న త‌న వ‌ర‌కు అద్భుతంగా చూపించాడు విజువ‌ల్స్. కానీ ద‌ర్శ‌కుడి క‌థే స‌హ‌క‌రించలేదు. ఎడిటింగ్ వీక్ అనిపిస్తుంది. రెండు గంట‌ల న‌డివి ఉన్నా కూడా సినిమా ఎందుకో బాగా సాగిన‌ట్లు అనిపిస్తుంది. క‌థ పాత‌దే.. క‌థ‌నం మ‌రీ రొటీన్.. డెస్టినీని న‌మ్ముకుని క‌థ‌లు రాసుకున్న‌పుడు స్క్రీన్ ప్లే చాలా ప‌ర్ఫెక్ట్ గా ఉండాలి. అది ఈ చిత్రంలో మిస్ అయింది. సోల్ లేని ప్రేమ‌క‌థ‌లా అనిపిస్తుంది నా నువ్వే. 

చివ‌ర‌గా: నా నువ్వే.. కొత్త‌ద‌నం మ‌రీ ఎక్కువైపోయిందబ్బా..!

రేటింగ్: 2.5/5

More Related Stories