English   

 క‌ళ్యాణ్ రామ్ లో ఇంత ప్రేమ ఉందా..? 

Naa-Nuvve-Trailer
2018-05-16 11:02:29

క‌ళ్యాణ్ రామ్ ను చూస్తుంటే మాస్ హీరోనే గుర్తొస్తాడు. ఆయ‌న‌లో ప్రేమ అనే ఓ యాంగిల్ ఉంద‌నే విష‌యం కూడా గుర్తుకు రాదు. ఎందుకంటే ఆ హీరో చేసిన సినిమాలు అలా ఉన్నాయి మ‌రి. మొద‌ట్నుంచీ కూడా అయితే యాక్ష‌న్.. లేదంటే యాక్ష‌న్ కామెడీ అంటూ చేసుకుంటూ వ‌చ్చాడు ఈ హీరో. ఇప్ప‌టికీ అదే రూట్ లో వెళ్తున్న క‌ళ్యాణ్ ను జ‌యేంద్ర మార్చేసాడు. మీతో ప్రేమ‌క‌థ చేస్తాన‌న్న‌పుడు క‌ళ్యాణ్ న‌వ్వుకుని ఉంటాడు కానీ ఇప్పుడు ఆ ఔట్ పుట్ చేసి నిజంగానే షాక్ అవుతుంటాడు. ఎందుకంటే ఇప్పుడు నా నువ్వే చూస్తుంటే అంద‌రికీ క‌లిగే ఫీలింగ్ ఇదే. తాజాగా ఈ చిత్ర ట్రైల‌ర్ విడుద‌లైంది. ఇందులో క‌ళ్యాణ్ రామ్ లుక్స్ చూసి అంతా షాక్ అవుతున్నారు. ఇప్పుడు ట్రైల‌ర్ లో క‌ళ్యాణ్, త‌మ‌న్నా మ‌ధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. పైగా సొంత డ‌బ్బింగ్ కూడా చెప్పుకుంది త‌మ‌న్నా. 180తో కాస్త అర్థం కాని ప్రేమ‌క‌థ‌ను చెప్పిన జ‌యేంద్ర ఈ సారి మాత్రం అర్థ‌మ‌య్యే క‌థ‌నే ప‌ట్టుకొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంది. ప్రేమించుకోవ‌డం.. విడిపోవ‌డం.. ఒక‌రి కోసం ఒక‌రు చూసుకోవ‌డం ఇవ‌న్నీ చూస్తుంటే నా నువ్వేలో ఏదో ఉంద‌నే విష‌యం అర్థ‌మ‌వుతుంది. మే 25న సినిమా విడుద‌ల కానుంది. మ‌రి ఈ చిత్రంతో క‌ళ్యాణ్ రామ్ కొత్త ఇన్నింగ్స్ మొద‌లు పెడ‌తాడో లేదో చూడాలిక‌..!

More Related Stories