English   

భరత్ తో పాటు కళ్యాణ్ రామ్..?

Naa-Nuvve
2018-04-19 18:09:26

భరత్ అనేనేను ఆడియో ఫంక్షన్ కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా వెళ్లాడు. ఇప్పుడు భరత్ తో పాటు ఆయన అన్న కళ్యాణ్ రామ్ వస్తున్నాడు. అది సరే.. కానీ ఎలా వస్తాడు అనుకుంటున్నారా..? భరత్ ఇంటర్వెల్ లో కళ్యాణ్ రామ్ వస్తాడు. ఇంకా డౌటా..? ఏం లేదండీ.. ఇప్పుడూ కళ్యాణ్ రామ్ కొత్త సినిమా ఉంది కదా.. నా నువ్వే అని. తమన్నా హీరోయిన్ గా నటించిన సినిమా. లేటెస్ట్ గా అదిరిపోయే ఓరొమాంటిక్ వీడియో సాంగ్ కూడా విడుదల చేశారు. జయేంద్ర డైరెక్ట్ చేసిన నా నువ్వే ట్రైలర్ విడుదల కాబోతోంది. ఈ ట్రైలర్ ను భరత్ అనేనేను ప్రదర్శించే థియేటర్స్ లో ప్రదర్శించబోతున్నారన్నమాట. అదీ మేటర్. అంటే భరత్ ఇంటర్వెల్ లో నా నువ్వే ట్రైలర్ ప్లే అవుతుంది. ఆ రకంగా అంత పెద్ద సినిమాతో పాటు నా నువ్వేకు మంచి పబ్లిసిటీ కూడా వస్తుంది.

కళ్యాణ్ రామ్, తమన్నా మొదటిసారిగా కలిసి నటించిన సినిమా నా నువ్వే. జయేంద్రకు దర్శకుడుగా మంచి పేరుంది. అందుకే ఈ సినిమాకు దృశ్యమాంత్రికుడు పి. సి. శ్రీరామ్ వంటి సినిమాటోగ్రఫీ అందించాడు. అది కూడా సినిమాకు హైలెట్ కాబోతోంది. కంప్లీట్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తోన్న నా నువ్వే మే 25నవిడుదల కాబోతోంది. రిలీజ్ కు చాలా టైమ్ ఉన్నా.. అప్పుడే ట్రైలర్ విడుదల చేస్తున్నారంటే వీరి ప్లాన్ అర్థం కావడం లేదూ. ఇప్పటి నుంచే సినిమాపై హైప్స్ పెంచే ప్రయత్నం చేస్తున్నారన్నమాట. మరి భరత్ తో పాటు వచ్చే నా నువ్వేకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

More Related Stories