English   

దేవుడా.. బ‌న్నీకి అక్క‌డ మ‌ళ్లీ షాక్..!

Naa-Peru-Surya

ఈ రోజుల్లో ఓవ‌ర్సీస్ మార్కెట్ కూడా తెలుగు సినిమాల‌కు కీల‌కంగా మారింది. ఇదివ‌ర‌కు మిలియ‌న్ మార్క్ దాటితే గొప్ప‌గా చెప్పుకునేవాళ్లు మ‌న హీరోలు. కానీ ఇప్పుడు తొలిరోజే అక్క‌డ 1 మిలియ‌న్ దాటేసి.. 2 మిలియ‌న్ వైపు పరుగులు తీస్తున్నాయి మ‌న సినిమాలు. ఇలాంటి స‌మ‌యంలో కూడా నా పేరు సూర్య లాంటి పెద్ద సినిమా మూడు రోజుల్లో కూడా 1 మిలియ‌న్ అందుకోలేక‌పోయింది. ఇదే ఇప్పుడు ఇండ‌స్ట్రీలో జ‌రుగుతున్న హాట్ టాపిక్. బ‌న్నీకి ఓవ‌ర్సీస్ లో మంచి ఫాలోయింగ్ ఉంది. కానీ కొన్నేళ్లుగా ఆయ‌న‌కు అక్క‌డ ఊహించిన వ‌సూళ్లు మాత్రం రావడం లేదు. డిజే.. స‌రైనోడు ఇండియాలో బాగా ఆడాయి కానీ ఓవ‌ర్సీస్ లో కాదు. ఈ రెండూ అక్క‌డ డిజాస్ట‌ర్లే. ఇప్పుడు నా పేరు సూర్య కూడా ఇదే ప‌రిస్థితి. ఈ చిత్రం కూడా ఎందుకో కానీ ఓవ‌ర్సీస్ లో అనుకున్న స్థాయి వ‌సూళ్లు తీసుకురావ‌డం లేదు. కొత్త క‌థ‌ల‌ను ఎంక‌రేజ్ చేస్తార‌నే పేరున్నా.. బ‌న్నీ ఇందులో చాలా కొత్త‌గా క‌నిపించినా కూడా ఎందుకో కానీ సూర్య‌కు అక్క‌డి ఆడియ‌న్స్ క‌నెక్ట్ కాలేదు. ఈ చిత్రం ఇప్ప‌టి వ‌ర‌కు 9 ల‌క్ష‌ల డాల‌ర్లు మాత్ర‌మే వ‌సూలు చేసింది. అంటే 1 మిలియ‌న్ రావాల‌న్నా మ‌రో ల‌క్ష డాల‌ర్లు రావాలి. మ‌రోవైపు ఈ చిత్రం అక్క‌డ సేఫ్ కావాలంటే అక్ష‌రాలా 1.5 మిలియ‌న్ పైనే రావాలి. మ‌రి చూడాలిక‌.. ఏం జ‌రుగుతుందో చివ‌రివ‌ర‌కు..? 

More Related Stories