English   

  నా పేరు సూర్య.. ఎంత బాకీ తెలుసా..?

Naa-peru-Surya
2018-05-08 12:58:47

అల్లుఅర్జున్ కు ఈ మ‌ధ్య కాలంలో టైమ్ బాగా క‌లిసొచ్చింది. ఆయ‌న‌కు చివ‌రి ప‌రాజ‌యం ఇద్ద‌ర‌మ్మాయిల‌తో.. అప్పుడెప్పుడో 2013లో పూరీ జ‌గ‌న్నాథ్ ఇచ్చాడు. ఆ త‌ర్వాత రేసుగుర్రం.. స‌న్నాఫ్ స‌త్యమూర్తి.. రుద్ర‌మ‌దేవి.. స‌రైనోడు.. డిజే.. ఇలా అన్ని సినిమాలు కూడా 50 కోట్ల‌కు పైగానే వ‌సూలు చేసాయి. ఇందులో స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి.. రుద్ర‌మ‌దేవి.. డిజే హిట్ కాదు.. అలాగ‌ని ఫ్లాప్ కూడా కాదు. అలా మిగిలిపోయాయంతే. కానీ ఇప్పుడు ఐదేళ్ల త‌ర్వాత బ‌న్నీకి షాక్ తగిలేలా ఉంది. ఈయ‌న న‌టించిన నా పేరు సూర్య‌కు వ‌సూళ్లు ఊహించ‌నంత‌గా రావ‌డం లేదు. నాలుగు రోజుల్లో ఈ చిత్రం కేవ‌లం 41 కోట్ల షేర్ మాత్ర‌మే వ‌సూలు చేసింది. ఈ చిత్రం అక్ష‌రాలా 80 కోట్ల బిజినెస్ చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చింది కేవ‌లం స‌గం మాత్ర‌మే. అంటే మ‌రో 40 కోట్లు వ‌స్తే కానీ సినిమా సేఫ్ కాదు. కానీ ఇప్ప‌టికే చాలా చోట్ల సినిమా స్లో అయిపోయింది. దానికి కార‌ణం కూడా లేక‌పోలేదు. స్క్రీన్ ప్లే మ‌రీ వీక్ గా ఉండ‌టంతో ఈ చిత్రం తొలిరోజే టాక్ నెగిటివ్ గా తెచ్చుకుంది. త‌ర్వాత దాన్ని నిల‌బెట్ట‌డానికి ఎన్ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నా కూడా నా పేరు సూర్య మాత్రం అలాగే ఉండిపోతుంది. మూడు రోజుల్లో క‌లెక్ష‌న్లు ప‌ర్లేద‌నే స్థాయిలో వ‌చ్చినా నాలుగో రోజు చాలా చోట్ల డౌన్ అయిపోయాయి. దాంతో నా పేరు సూర్య భ‌విష్య‌త్తుపైనే అంద‌రికీ అనుమానాలు మొద‌ల‌య్యాయి. పైగా మే 9న మ‌హాన‌టి.. 11న మెహ‌బూబా విడుద‌ల కానుండ‌టంతో సూర్య జ‌ర్నీ మ‌రింత క్లిష్ట‌త‌రం కావ‌డం ఖాయం. మ‌రి చూడాలిక‌.. ఈ క‌ష్టం నుంచి సూర్య ఎలా త‌ప్పించుకుంటాడో..? ఎలా బ‌య‌ట‌ప‌డ‌తాడో..? 

More Related Stories