English   

నా పేరు సూర్య ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్.. 

Naa-peru-surya

నా పేరు సూర్య ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైంది. కానీ తొలిరోజు ఈ చిత్రానికి ఊహించినంత టాక్ అయితే రాలేదు. తొలి రోజు యావ‌రేజ్ టాక్ తోనే ప్రారంభ‌మైంది ఈ చిత్రం. ఇక ఇప్పుడు వ‌సూళ్లు కూడా దానికి త‌గ్గ‌ట్లుగానే వ‌చ్చాయి. డిజేను కూడా దాట‌లేక‌పోయింది నా పేరు సూర్య‌. ఈ చిత్రం తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో 16.20 కోట్లు షేర్ వ‌సూలు చేసింది. ఇది మంచి వ‌సూళ్లే కానీ ఇప్పుడు స్టార్ హీరోల‌కు వ‌స్తున్న వ‌సూళ్ల‌తో పోలిస్తే కాస్త త‌క్కువే. ఎందుకంటే గ‌తేడాది బ‌న్నీ డిజేతో 18.57 కోట్ల షేర్ తీసుకొచ్చాడు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ చిత్రం 22 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. ఇక ఇప్పుడు నా పేరు సూర్య వ‌ర‌ల్డ్ వైడ్ గా 20 కోట్ల షేర్ వ‌సూలు చేసింది. అన్నిచోట్లా ప్ర‌స్తుతానికి వ‌సూళ్లు బాగానే ఉన్నాయి. కానీ మూడు రోజుల త‌ర్వాత ఎలా ఉంటుంది అనే దానిపైనే సూర్య భ‌విష్య‌త్తు ఆధార‌ప‌డి ఉంది. సీరియ‌స్ స‌బ్జెక్ట్ కావ‌డంతో అంద‌రికీ క‌నెక్ట్ అవుతుందా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. చూడాలిక‌.. చివ‌రికి ఏం జ‌రుగుతుందో..?

More Related Stories