English   

నా పేరు సూర్య.. వీకెండ్ ప‌రిస్థితేంటి..?

allu-arjun

ఈ రోజుల్లో సినిమాల‌కు మూడు రోజుల క‌లెక్ష‌న్లు చాలా ముఖ్యం. త‌ర్వాత కాస్త నిల‌బ‌డితే చాలు సినిమా ఎలాగోలా ఒడ్డున ప‌డుతుంది. కానీ ఆ మూడు రోజులే నిరాశ ప‌రిస్తే మాత్రం ఇక చెప్పేదేం లేదు. సినిమా అస్సామే. ఇప్పుడు నా పేరు సూర్య కూడా విడుద‌లైంది. తొలిరోజు ఈ చిత్రానికి 21 కోట్ల షేర్ వచ్చింది. డిజేతో పోల్చుకుంటే ఇది త‌క్కువే. డిజే రెండో రోజు కూడా 8 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. కానీ ఈ చిత్రం మాత్రం కేవ‌లం 5.70 కోట్ల ద‌గ్గ‌రే ఆగిపోయింది. మూడు రోజుల్లో నా పేరు సూర్య 32 కోట్ల షేర్ వ‌సూలు చేసిన‌ట్లుగా తెలుస్తుంది. ఈ విష‌యంలో డిజే చాలా ముందున్నాడు. ఈ చిత్రం మూడు రోజుల్లోనే 42 కోట్ల‌కు వ‌సూలు చేసింది. ఆ త‌ర్వాత ప‌డుతూ లేస్తూ అబౌ యావ‌రేజ్ ద‌గ్గ‌ర ఆగిపోయాడు. కానీ ఇప్పుడు సూర్య ప‌రిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. ఈ చిత్రం సేఫ్ కావాలంటే 80 కోట్లు వ‌సూలు చేయాలి. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు వ‌చ్చిందే 30 కోట్లు. ఇంకా 50 కోట్లు బ్యాలెన్స్. ఓ వైపు ఐపిఎల్.. మ‌రోవైపు ఎండ‌లు.. ఇంకోవైపు సినిమాకు డివైడ్ టాక్ ఇన్నింటి మ‌ధ్య‌లో సూర్య ఇరుక్కుపోయాడు. ఇప్పుడు సినిమా నిల‌బ‌డాలంటే ఏదో అద్భుతం జ‌ర‌గాల్సిందే. దానికితోడు మ‌రో రెండు రోజుల్లో మ‌హాన‌టి రానుంది. అది వ‌చ్చిన త‌ర్వాత సూర్య ప‌రిస్థితి ఇంకెలా ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు. మ‌రి చూడాలిక‌.. సూర్య చివ‌రికి ఎక్క‌డివ‌ర‌కు వ‌చ్చి ఆగుతాడో..? మ‌రోవైపు ఓవ‌ర్సీస్ లో కూడా ఈ చిత్రం ఊహించినంత‌గా వ‌సూలు చేయ‌డం లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు అక్క‌డ మిలియ‌న్ మార్క్ కూడా అందుకోలేదు ఈ చిత్రం. 

More Related Stories