English   

అల్లు అర్జున్ సెంచరీ కొట్టేశాడు.. 

Allu-Arjun

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ నా పేరుసూర్య నా ఇల్లు ఇండియా. వక్కంతం వంశీ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న మూవీ ఇది. బన్నీ ఫస్ట్ టైమ్ సోల్జర్ గా నటిస్తున్నాడీ మూవీతో. అనూ ఇమ్మానుయేల్ హీరోయిన్. మూవీకి సంబంధించిన రిలీజ్ చేసిన రెండు పాటలకూ మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇవే కాక మూవీపై ముందు నుంచీ విపరీతమైన పాజిటివ్ బజ్ ఉంది. దీంతో బిజినెస్ కూడా అదిరిపోయిందంటున్నారు. ఏప్రిల్ 26న విడుదల కాబోతోన్న ఈ మూవీకి సంబంధించిన బిజినెస్ క్లోజ్ అయిందనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకూ పూర్తయిన బిజినెస్ తో మూవీకి టేబుల్ ప్రాఫిట్ వచ్చినట్టే అంటున్నారు. 

బన్నీ లాస్ట్ మూవీ డిజే నైజాంలో అతని కెరీర్ లోనే హయ్యొస్ట్ ప్రైస్ కు అమ్మేశారు. ఇప్పుడు కూడా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియాను 21.5కోట్లకు అమ్మేశారు. ఇదే కాక మొత్తం థియేట్రికల్ బిజినెస్ 80కోట్లకు క్లోజ్ అయిందట. ఇక శాటిలైట్, డబ్బింగ్ రైట్స్ రూపంలో మరో 20కోట్లు బ్యాగ్ చేసుకున్నారు. అంటే మొత్తం వంద కోట్లకు ఈ మూవీ ఓవరాల్ రైట్స్ అమ్మేశారు. బన్నీ సెంచరీ కొట్టేసినట్టే. అయితే సినిమాకు అయిన బడ్జెట్ మాత్రం 70కోట్లు. ఇందులోనే రెమ్యూనరేషన్స్ కూడా ఉన్నాయట. మరి ఆ రకంగా చూస్తే సినిమా పూర్తిగా సేఫ్ జోన్ లోనే ఉంది. రిలీజ్ తర్వాత ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా వంద కోట్లు కలెక్ట్ చేయడం పెద్ద కష్టమేం కాదు.. 

More Related Stories