English   

డేంజ‌ర్.. సేఫ్ జోన్ రెండూ బ‌న్నీవే..!

Naa-Peru-Surya
2018-03-05 15:36:29

ముందు నుయ్యి.. వెన‌క గొయ్యి అంటారు క‌దా.. ఇప్పుడు అలా మారిపోయింది బ‌న్నీ సిచ్యువేష‌న్. అన్నీ చేతుల్లోనే ఉన్న‌ట్లు క‌నిపిస్తున్నాయి కానీ ఏవీ లేవు. ఈయ‌న న‌టిస్తున్న నా పేరు సూర్య సినిమా మే 4న విడుద‌ల కానుంది. కానీ దానికి ముందు రెండు సినిమాలు వ‌స్తున్నాయి. అవి కూడా భారీ సినిమాలే. ఒక‌టి ఎప్రిల్ 20న‌.. మ‌రొక‌టి ఎప్రిల్ 27న‌.. ఈ రెండు సినిమాల త‌ర్వాత బ‌న్నీ సినిమా వ‌స్తుంది. కొన్ని రోజులుగా ఇండ‌స్ట్రీలో ఎప్రిల్ 26 కోసం జ‌రుగుతున్న యుద్ధం గురించి కొత్తగా చెప్పేదేం లేదు. బ‌న్నీ, మ‌హేశ్ రావ‌డానికి చాలా రోజుల నుంచి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నారు. ఐతే వీళ్ల మ‌ధ్య‌లోకి దిల్ రాజు వ‌చ్చాడు. దాంతో విష‌యం చాలా సింపుల్ గా ప‌రిష్కారం అయిపోయింది. ఎప్రిల్ 20కి మ‌హేశ్.. మే 4కి బ‌న్నీ వెళ్లాడు. ఈ ఇద్ద‌రి గ్యాప్ లోకి ర‌జినీకాంత్ వ‌చ్చేసాడు. 

ఎంత‌సేపూ మ‌హేశ్, బ‌న్నీ అటూ ఇటూ క‌దులుతున్నారు కానీ ర‌జినీ మాత్రం ముందు నుంచీ అక్క‌డే తిష్ట వేసుకుని కూర్చున్నాడు. ఇప్పటికీ ఇదే జ‌రుగుతుంది. ఎప్రిల్ 27న కాలా రానుంది. ఇది ఎప్పుడో ఫిక్స్ చేసాడు నిర్మాత ధ‌నుష్. ఓ త‌మిళ సినిమా కోసం ఇప్పుడు ఇద్ద‌రు తెలుగు హీరోలు కొట్టుకుని ప‌క్క‌కు వెళ్లిపోయిన‌ట్లు ఉంది ప‌రిస్థితి. ఏం చేస్తాం.. ఎంతైనా అక్క‌డున్న‌ది ఆల్ ఇండియ‌న్ సూప‌ర్ స్టార్ క‌దా.. ఆ మాత్రం రెస్పెక్ట్ ఇవ్వ‌క త‌ప్ప‌దు. సింపుల్ గా ఓ చోట కూర్చుని మాట్లాడుకుని.. దిల్ రాజు అటు భ‌ర‌త్ అనేనేను.. ఇటు నా పేరు సూర్య నిర్మాత‌ల మ‌ధ్య సంధి కుదిర్చాడు. దాంతో మూడు వారాల గ్యాప్ లో మూడు భారీ సినిమాలు వ‌స్తున్నాయి. ఇది కూడా అంద‌రికీ మంచిదే. మూడు సినిమాలు క‌చ్చితంగా క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించేవే. అయితే భ‌ర‌త్ అనే నేను, కాలాకు టాక్ బాగా వ‌స్తే మాత్రం బ‌న్నీకి టెన్ష‌న్ త‌ప్ప‌దు. అప్పుడు నా పేరు సూర్య అద్భుతం అనే టాక్ వ‌స్తే కానీ బ‌య‌ట ప‌డ‌దు. టాక్ కానీ తేడాగా వ‌స్తే బ‌న్నీకి బ్యాండ్ ప‌డిపోవ‌డం ఖాయం.

More Related Stories