English   

బ‌న్నీ టార్గెట్ భారీగానే ఉంది.. 

Naa-peru-surya
2018-05-03 09:08:07

ఈ రోజుల్లో స్టార్ హీరోల సినిమాలంటే హాట్ కేకులే. ఎలా ఉన్నా ప‌ర్లేదు కానీ ముందుగానే బిజినెస్ అంతా అయిపోతుంది. ఇప్పుడు బ‌న్నీకి కూడా ఇదే జ‌రుగుతుంది. ఈయ‌న న‌టించిన నా పేరు సూర్య బిజినెస్ అయితే హాట్ కేక్ కంటే ఫాస్ట్ గా అయిపోయింది. అస‌లే మ‌నోడు ఇప్పుడు ఫామ్ లో ఉన్నాడు క‌దా.. దాంతో ముందు వెన‌క చూడ‌కుండా కొత్త ద‌ర్శ‌కుడి సినిమా అని కూడా మ‌రిచిపోయి 100 కోట్ల‌కు పైగానే అమ్ముడైపోయింది. ఇదే ఇప్పుడు ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్. నైజాంలోనే సినిమా 21 కోట్ల‌కు అమ్ముడైంది. ఇది రావాలంటే సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ కావాలి. మిగిలిన ఏరియాల్లోను ఎక్క‌డా త‌గ్గ‌లేదు సూర్య‌. అన్ని చోట్లా రికార్డ్ రేట్ల‌కు అమ్మేసారు. ఒక్క తెలంగాణ‌, ఆంధ్రాల్లోనే సినిమా 60 కోట్ల‌కు పైగా అమ్ముడైంది. ఇక ఓవ‌ర్సీస్.. క‌ర్ణాక‌ట‌.. త‌మిళ‌నాడు అన్నీ క‌లిపితే మ‌రో 25 కోట్లు జ‌మ‌య్యాయి. ఇప్ప‌టి వ‌ర‌కు బ‌న్నీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ స‌రైనోడుకు వ‌చ్చింది 75 కోట్లు. ఇప్పుడు దానికంటే 10 కోట్లు ఎక్కువ‌కే నా పేరు సూర్య‌ను కొన్నారు బ‌య్య‌ర్లు. అంటే అద్భుతాలు జ‌రిగితే త‌ప్ప అంతా వెన‌క్కి రాదు. మొన్న వ‌చ్చిన భ‌ర‌త్ అనే నేనుకు కూడా సూప‌ర్ హిట్ టాక్ వ‌చ్చినా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు సేఫ్ జోన్ కు రాక‌పోవ‌డానికి కార‌ణం ఈ హై రేట్లే. అంతెందుకు బ‌న్నీ డిజే సినిమా కూడా అంతే క‌దా..! హై రేట్ల‌తో అమ్మిన కార‌ణంగానే 72 కోట్లు వ‌చ్చినా కూడా యావ‌రేజ్ ద‌గ్గ‌రే ఆగాల్సి వ‌చ్చింది. మ‌రి ఇప్పుడు నా పేరు సూర్య ఏం చేస్తాడో..? ఈ చిత్రం మే 4న దాస‌రి జ‌యంతి రోజు విడుద‌ల కానుంది. మ‌రి చూడాలిక‌.. బ‌న్నీ ఏం చేస్తాడో..?  
 

More Related Stories