English   

అల్లు అర్జున్ కూడా మొదలుపెట్టాడు

Naa-Peru-Surya
2018-04-17 15:13:07

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా మొదలుపెట్టేశాడిక. ఇప్పటి వరకూ ఇతర సినిమాల హడావిడీలో తనేం చేసినా పెద్దగా ఎక్కదనుకున్నాడో ఏమో.. అందుకే ఆ హడావిడీ తగ్గాకే తనూ మొదలుపెట్టబోతున్నాడు. తన లేటెస్ట్ మూవీ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ప్రమోషన్స్ ను అతి త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నారు. ఇందులో భాగంగా ముందుగా ఆడియో వేడుకకు రంగం సిద్ధం అయింది. ఈ నెల 22న నా పేరు సూర్య ఆడియో విడుదల చేసేందుకు అంతా సిద్ధమైంది. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అంటూ కొత్త ట్రెండ్ స్టార్ట్ చేసిన బన్నీ.. సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ఆ ప్రాంతంలోనే ఆడియో రిలీజ్ అనే మరో సంప్రదాయానికీ తెరలేపాడు.  ఆంధ్ర ప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వద్ద గల మాధవరం అనే ఊళ్లో నా పేరు సూర్య ఆడియో విడుదల చేయబోతున్నారు. ఎన్నో ఫెసిలిటీస్ ఉన్న సిటీస్ ను వదిలి ఈ గ్రామంలో వేడుక ఎందుకు చేస్తున్నారో తెలుసా.. ఈ సినిమా నేపథ్యానికి తగ్గ మెటీరియల్ ఆ ఊళ్లో ఉండటమే. యస్.. మాధవరం అనే ఊళ్లో దాదాపు ప్రతి ఇంటిలోనూ ఓ సైనికుడు ఉన్నాడు. నా పేరు సూర్యలో అల్లు అర్జున్ కూడా సైనికుడు పాత్రలో కనిపిస్తున్నాడు కదా. అందుకే తన వేడుకకు ఈ ఊరిని సెలెక్ట్ చేసుకున్నాడు. మరి ఇంత పెద్ద స్టార్ ఫంక్షన్ అంత చిన్న ఊళ్లో చేస్తే టెక్నికల్ గా, ప్రాక్టికల్ గా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే అవేవీ లేకుండా చాలా రోజుల నుంచే అక్కడ అన్ని ఏర్పాట్లూ చేస్తున్నారు. ఇందుకోసం ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ డిపార్ట్ మెంట్ నుంచి పూర్తి సహకారం తీసుకుంటున్నారు. ఏదేమైనా ఈ నెల 22న జరిగే ఆడియోతో పాటు ట్రైలర్ కూడా విడుదలవుతుంది. దాన్ని బట్టి ఈ సూర్య రేంజ్ ఎలా ఉంటుందో ఓ అంచనాకు రావచ్చు. ఇక మే 4న విడుదల కాబోతోన్న సినిమా కోసం 22 న ఆడియోతో మొదలుపెట్టి ఇక కంటిన్యూస్ గా ఏదో ఒక రకంగా ప్రచారం చేయబోతున్నారు. సో.. తన సినిమా ప్రమోషన్ బన్నీ మొదలుపెట్టాడు. 

More Related Stories