English   

అల్లు అర్జున్ ట్రైలర్ వచ్చేస్తోంది.

Naa-Peru-Surya
2018-04-27 17:03:02

దేశభక్తి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఫెయిల్ అయిన దాఖలాలు తక్కువ. ఏ భాషలో వచ్చినా మరే భాషలో డబ్ అయినా ఆ సినిమాలకు మంచి ఆదరణే ఉండేది.. ఉంటోంది. తన కెరీర్ లో ఫస్ట్ టైమ్ అల్లు అర్జున్ ఓ సైనికుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రాణాలు పోతే అది బార్డర్ లోనే చెప్పేంతటి దేశభక్తి ఈ కుర్రాడి సొంతం. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా అనే భావనను నరనరాన నింపుకున్న సూర్య.. తన ఇంటికి కాపలాగా ఉంటూ.. ఆ ఇంటిపై దాడి చేయాలనుకునే శతృమూకలను ఎలా తిప్పికొట్టాడనే కథాంశంతో వస్తోన్న సినిమా ఇది. ఇప్పటికే విడుదలైన టీజర్, డైలాగ్ ఇంపాక్ట్ ప్రోమోతో పాటు పాటలకూ మంచి స్పందన వచ్చింది.  రేపు ఉదయం 11గంటలకు నా పేరు సూర్య ట్రైలర్ కూడా విడుదల చేయబోతున్నారు. అనూ ఇమ్మానుయేల్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీకి వక్కంతం వంశీ దర్శకుడు. వంశీకి దర్శకుడిగా ఇదే తొలిప్రయత్నం. ఇక బాలీవుడ్ ద్వయం మ్యూజిక్ అందించిన ఈ మూవీలోని పాటలను విడుదల చేశారు. ఆదిత్య మ్యూజిక్ విడుదల చేసిన ఈ ఆడియో జూక్ బాక్స్ యూ ట్యూబ్ లో అందుబాటులో ఉంది. ఇక మే 4న విడుదల కాబోతోన్న నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఈ నెల 29న హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో జరగబోతోంది. ఆల్రెడీ మిలట్రీ మాధవరం లో విడుదల చేసిన ఆడియో ఫంక్షన్ తో ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న టీమ్.. ఇప్పుడు తెలంగాణ అభిమానుల కోసం ఈ ఫంక్షన్ ఏర్పాటు చేసింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ చీఫ్ గెస్ట్ గా హాజరు కాబోతున్నాడు. మొత్తంగా మే 4న రిలీజ్ కు రెడీ గా ఉన్నా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా లోడ్ చేసిన గన్ లా ఉందంటోంది టీమ్. మరి ఈ బుల్టెట్స్ బాక్సాఫీస్ పై ఏ మేరకు ప్రభావం చూపుతాయో చూడాలి. 
 

More Related Stories