English   

అల్లరి నరేష్ నాంది రివ్యూ

 Naandhi Review
2021-02-19 22:44:42

కామెడీ సినిమాలతో అల్లరి చేసే నరేష్ అప్పుడప్పుడు డిఫరెంట్ స్టోరీలతో వస్తూ తనలోని నటుడిని పరిచయం చేస్తూ ఉంటాడు. ఇప్పటికే నరేష్ గమ్యం, నేను, మహర్షి లాంటి సినిమాలలో డిఫరెంట్ పాత్రలు పోషించి ప్రేక్షకులను లరించాడు. ఇక మరోసారి నరేష్ అలాంటి డిఫరెంట్ క్యారక్టర్ తోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అదే "నాంది". ఈ సినిమాలో ముఖ్యంగా నరేష్ నగ్న పోస్టర్లు ఉండటంతో ఫ్రీ పబ్లిసిటీ అయ్యింది. అంతే కాకుండా సినిమాపై అంచనాలు కీడా భారీగా పెరిగాయి. ఇక ఎన్నో అంచనాల మధ్య విడుదలైన నాంది ప్రేక్షకులను అలరరించిందా..లేదా ఇప్పుడు  చూద్దాం.

కథ : బండి సూర్య ప్రక్షాష్ (అల్లరినరేశ్) చిన్నప్పటినుండి తల్లింతండ్రులకు సూర్య అంటే..సూర్య కు తల్లిదండ్రులు అంటే ఎనలేని ప్రేమ. దాంతో చదువు పూర్తయ్యాక సాప్ట్ వేర్ ఉద్యోగం లో చేరి వాళ్ళని హ్యాపీగా చూసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఇక సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తూ కుటుంబంతో ఆనందగా ఉన్న సూర్య జీవితంలో ఒక అనుకోని సంఘటన జరుగుతుంది. పౌరహక్కుల నేత రాజగోపాల్ హత్య కేసులో  సూర్య అరెస్ట్ అవుతాడు. చెయ్యని నేరానికి అతడిని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. కేసుల మీద కేసులు పెడుతూ ఐదేళ్ల పాటు టార్చర్ పెడతారు. ఈ క్రమంలో లాయర్ ఆద్య (వరలక్ష్మి శరత్ కుమార్) కేసును టేకప్ చేస్తుంది. సూర్య ను నిర్దోషిగా భయటకు తీసుకువస్తుంది. ఇక  అలా భయటకు వచ్చిన సూర్య తనకు జరిగిన అన్యాయం గురించి ఎలా పోరాడాడు. ఆద్య అతడిని ఎందుకు భయటకు తీసుకువస్తుంది. పౌర హక్కుల నేతను అసలు ఎవరు చంపుతారు. ఆ కేసులో సూర్య ను ఎందుకు అరెస్ట్ చేస్తారు అన్నదే ఈ సినిమా కథ.

విశ్లేషణ : ఇండియన్ పీనల్ కోడ్ లోని సెక్షన్ 211 కు సంబంధించిన కథే ఈ నాంది సినిమా. ఈ సినిమా దర్శకుడు విజయ్ కనకమేడల కు మొదటి సినిమానే అయినా తీసిన విధానం చూస్తే అతడికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ముఖ్యంగా కథ కథనాలు ఈ సినిమాకు ప్రాణం పోసాయి. సినిమాలో పోలీస్ ఇన్వెస్టిగేషన్ తీరు...న్యాయవ్యవస్థలో ఉన్న లోపాలను దర్శకుడు చూపించడంలో సాఫలం అయ్యాడు. రాజకీయ నాయకులు చట్టాలను ఎలా బ్రస్తుపట్టిస్తున్నారో చక్కగా చూపించాడు. అంతే కాకుండా సినిమాలో విజయ్ రాసిన డైలాగులు సూపర్ గా ఉన్నాయి. ప్రీ క్లైమాక్స్ సన్నివేశాలు భావోద్వేగ భరితంగా ఉంటాయి. ఈ సినిమా అల్లరి నరేష్ కెరీర్ లో ఒక బెస్ట్ సినిమాగా నిలిచింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక సినిమాలో పాటలు అంతంత మాత్రంగా ఉన్నా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయింది. సినిమాటోగ్రఫి బాగుంది. సినిమాలో నరేష్ నటన నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అని చెప్పొచ్చు..ఇక హీరోయిన్ వరలక్ష్మి కూడా తన నటనతో ప్రేక్షకులను కట్టి పడేసింది. ఎక్కడా సాగతీత లేకుండా తెరకెక్కించడం గొప్ప విషయం. ఇక మొత్తానికి ఈ సినిమా నరేష్ విజయానికి నాంది అని చెప్పవచ్చు.

More Related Stories