English   

సుధీర్ బ్యూటీ పై ర‌వితేజ క‌న్ను

Nabha-Natesh
2018-09-22 20:40:53

ఇండ‌స్ట్రీలో హిట్టే ప్రామాణికం. హిట్ ఉంటే టాలెంట్ తో ప‌నిలేదు కూడా. కానీ లేటెస్ట్ గా టాలీవుడ్ లో శాండ‌ల్ భామ‌ల హ‌వా మ‌ళ్లీ పెరుగుతోంది.ఛ‌లో తో ఇక్క‌డ పాగా వేసిన ర‌ష్మిక మంద‌న్నా త‌ర్వాత ఇప్పుడు మ‌రో కొత్త బ్యూటీ మ‌నాళ్ల‌ను అట్రాక్ట్ చేస్తోంది. త‌నే న‌భా న‌టేష్‌. సుధీర్ బాబు ప‌రిచ‌యం చేసిన బ్యూటీ త‌ను. ఈ శుక్ర‌వారం విడుద‌లైన న‌న్ను దోచుకుందువ‌టే సినిమాకు ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ ఈ భామే అనేది చూసిన ప్ర‌తి ఒక్క‌రూ చెబుతోన్న విష‌యం. మంచి లుక్స్ మాత్ర‌మే కూడా హాట్ హాట్ సోయ‌గాలు సైతం సొంతం చేసుకున్న ఈ భామలో యాక్టింగ్ స్కిల్స్ కూడా బానే ఉన్నాయి.దీనికి తోడు న‌న్నుదోచుకుందువ‌టే సినిమాకు పూర్తిగా పాజిటివ్ రివ్యూస్ వ‌స్తున్నాయి. దీంతో అమ్మ‌డు చాలా త్వ‌ర‌గానే బిజీ అవుతోంది. ఈ నేప‌థ్యంలో ఈ క‌న్న‌డ క‌స్తూరిపై ర‌వితేజ క‌న్ను ప‌డింది.

చేస్తోన్న సినిమాలు వ‌రుస‌గా పోతోన్నా.. ఏ మాత్రం ఆఫ‌ర్స్ త‌గ్గ‌కుండా దూసుకుపోతోన్న ర‌వితేజ ప్ర‌స్తుతం అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోనీ మూవీ చేస్తున్నాడు. దీని త‌ర్వాత ఆల్రెడీ క‌మిట్ అయిన సినిమా ఉంది. టైగ‌ర్, ఎక్క‌డికిపోతావు చిన్న‌వాడా సినిమాల‌తో ఆక‌ట్టుకున్న విఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో సినిమాకు ర‌వితేజ ఎప్పుడో గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు. త్వ‌ర‌లోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ల‌బోతోంది. ఈ మూవీలోనే న‌భా న‌టేష్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. కాస్త ముదురు హీరో్ అయినా క్రేజ్ ఉన్నోడు కాబ‌ట్టి ర‌వితేజ స‌ర‌స‌న న‌టించ‌డానికి న‌భాకు అభ్యంత‌రం ఏమీ క‌నిపించ‌లేదు. దీంతో మాస్ రాజాతో రొమాన్స్ కు వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. న‌న్నుదోచుకుందువ‌టే సినిమాలో మాస్ బ్యూటీగా రెచ్చిపో్యిన న‌భా ఈ సారి ఏకంగా మాస్ రాజాతోనే  జ‌త క‌ట్టింది. మ‌రి ఈ డ‌బుల్ మాస్  క‌పుల్ ఆడియ‌న్స్ కు ఏ రేంజ్ లో జోష్ ఇస్తారో చూడాలి.

More Related Stories