English   

న‌డిగ‌ర్ తిల‌గం.. అక్క‌డ సంచ‌ల‌నం..!

Mahanati

ఏ ఆడ‌పిల్ల‌కైనా పుట్టినిల్లు.. మెట్టినిల్లు ఉంటాయి. ఇప్ప‌టికే సావిత్రి పుట్టింట్లో సంచ‌ల‌నాలు సృష్టిస్తుంది. అంటే మ‌హాన‌టి సినిమా తెలుగులో పెద్ద విజ‌యం సాధించింది. ఇక ఇప్పుడు అత్తవారింటికి వెళ్లింది ఈ న‌డిగ‌ర్ తిల‌గం. అంటే త‌మిళ్ లో మ‌హాన‌టి అని అర్థం. తెలుగు కంటే రెండ్రోజులు ఆల‌స్యంగా విడుద‌లైంది అక్క‌డ ఈ చిత్రం. తొలిరోజే ఈ చిత్రానికి అద్భుతం అనే టాక్ వ‌చ్చేసింది. జెమినీ గ‌ణేష‌న్ ను విల‌న్ గా చూపించినా కూడా అక్క‌డ సావిత్రికి అంతా ఫిదా అయిపోతున్నారు. నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించిన తీరు అద్భుతం అంటున్నారు. ముఖ్యంగా క‌లెక్ష‌న్ల వైజ్ గా కూడా తెలుగు కంటే త‌మిళ్ లో ఎక్కువ‌గా వ‌చ్చే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. త‌మిళ ప్రేక్ష‌కులు మ‌హా మొండోళ్లు. ఇత‌ర భాషా సినిమాల‌ను మ‌నం ఎందుకు చూడాలి అనుకునే ర‌కం వాళ్లు. అలాంటి వాళ్ల‌కు కూడా మ‌హాన‌టి బ‌హుబాగా న‌చ్చేసింది. పైగా త‌మిళ్ ఇండ‌స్ట్రీ సావిత్రికి మెట్టినిల్లు. దానికి కార‌ణం జెమిని గ‌ణేష‌న్. ఆయ‌న్ని పెళ్లి చేసుకుని త‌మిళ‌నాడుకు కోడ‌లైపోయింది మ‌న అమ్మ‌. తెలుగు, త‌మిళ క‌లిసి ఈజీగా 40 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసేలా క‌నిపిస్తుంది ఈ న‌డిగ‌ర్ తిల‌గం.

More Related Stories