English   

నాగార్జున‌.. ఎంత మంచి వాడ‌వయ్యా..?

Nag-Goodachari
2018-08-08 16:58:10

ఇండ‌స్ట్రీ అన్న త‌ర్వాత పోటీ క‌చ్చితంగా ఉంటుంది. ఒకేరోజు రెండు సినిమాలు విడుద‌లైన‌పుడు మ్యాగ్జిమమ్ త‌మ సినిమాకే ఎక్కువ‌గా ప్ర‌మోట్ చేస్తుంటారు నిర్మాత‌లు. కానీ నాగార్జున మాత్రం ఇక్క‌డ విభిన్నం. ఈయ‌న మంచి సినిమా ఏదైనా కూడా ప్ర‌మోట్ చేస్తుంటాడు. మొన్న‌టికి మొన్న చిన్న సినిమా ఆర్ఎక్స్ 100కు త‌న స‌పోర్ట్ ఇచ్చాడు. ఇక ఇప్పుడు గూఢ‌చారిపై కూడా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. ఈ సినిమా క‌థ‌ను అడ‌విశేష్ రాసిన విధానం నాగ్ కు బాగా న‌చ్చేసింది. దాంతో సినిమా చూసిన వెంట‌నే ట్విట్టర్ లో గూఢచారి టీంను అభినందించాడు. ఇక్క‌డ మ‌రో విష‌యం ఏంటంటే.. ఇదే సినిమాకు పోటీగా త‌న మేన‌ల్లుడు సుశాంత్ న‌టించిన చిల‌సౌ కూడా విడుద‌లైంది. 

పైగా ఇది త‌న బ్యాన‌ర్ నుంచి విడుద‌లైన సినిమా. అయినా కూడా త‌న సినిమాను కాద‌ని మ‌రో సినిమాను నాగార్జున ప్ర‌మోట్ చేయ‌డం.. ఇప్పుడు ఈ సినిమా విజ‌యోత్స‌వ స‌భ‌కు కూడా ఈయ‌న రానుండ‌టం నిజంగా విశేష‌మే. ఇలాంటి స్పోర్టివ్ వాతావ‌ర‌ణం ఉన్న‌పుడే ఇండ‌స్ట్రీలో ఇంకా మంచి సినిమాలు వ‌స్తాయి. మొత్తానికి త‌న సినిమాతో పాటే మ‌రో సినిమాను కూడా అదే స్థాయిలో ప్ర‌మోట్ చేసి ఎంత‌మంచి వాడ‌వ‌య్యా అనిపించాడు మ‌న మ‌న్మ‌థుడు.

More Related Stories