ప్రభాస్ ఫోన్ వాడుతాడా.. షాకింగ్ విషయాలు బయటపెట్టిన నాగ్ అశ్విన్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. వాటిలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వస్తున్న సినిమా కూడా ఒకటి. ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా దీపికా పదుకునే నటిస్తోంది. ఈ చిత్నాన్ని సైన్స్ ఫిక్షన్ కథాంశం నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగ్ అశ్విన్ ప్రభాస్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. సెలబ్రటీలు అంటే బడా బ్రాండ్ ల ఫోన్ లను వాడుతుంటారు. అంతే కాకుండా సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ ఫుల్ బిజీగా ఉంటారు. కానీ ప్రభాస్ మాత్రం సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటారట. అంతే కాకుండా ఆయను సోషల్ మీడియాలో ఎంత మంది ఫాలోవర్లు ఉన్నారో కూడా తెలియదట. అసలు ప్రభాస్ ఫోన్ వాడుతారా లేదా అన్న అనుమానం కూడా ఉందట. ఎందుకంటే ప్రభాస్ తో మాట్లాడుతున్న సమయంలో అసలు ఎప్పుడూ ఆయన ఫోన్ రింగ్ అయినట్టు...ఆయన ఫోన్ మాట్లాడినట్టు కనిపించలేదట. కానీ మొత్తానికి ప్రభాస్ కు తన దగ్గరకు వెళ్లిన వాళ్లను మాత్రం హ్యాపీగా ఉంచడం తెలుసని అన్నారు.