English   

మణిరత్నం తర్వాత నాగ్ అశ్వినేనా..?

nag-ashwin
2018-05-10 10:48:57

బయోపిక్.. ఒకరి జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరించడం అంటేనే రిస్క్ తో కూడిన వ్యవహారం. అందుకే చాలామంది వీటివైపు వెళ్లరు. వెళ్లినా.. ఆ కథలో వాస్తవాలతో పాటు మరికొన్ని అవాస్తవాలనూ కలిపి సినిమాటిక్ లిబర్టీ తీసుకుంటారు. దీంతో అది క్లమ్జీ అవుతుంది. గతంలో వచ్చిన సిల్క్ స్మిత కథగా చెప్పిన ‘ద డర్టీ పిక్చర్’కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ కావడానికి ఈ కల్పిత కథలే కారణం. అలా చూసినా సౌత్ లో బయోపిక్స్  తక్కువంటే తక్కువ. ఆ వచ్చిన వాటిలో కూడా జెన్యూన్ అండ్ డేర్ ఫుల్ అటెంప్ట్ కనిపించదు. అయితే 1997లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఇరువుర్(తెలుగులో ఇద్దరు) అప్పట్లో అద్భుతమైన ప్రశంసలు అందుకుంది. తమిళనాట సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకుని ముఖ్యమంత్రి అయిన ఎమ్జీఆర్, ఆయన మిత్రుడుగా ఉండి ఆ తర్వాత శత్రువుగా మారిన కవి, నిర్మాత కరుణానిధిల కథగా వచ్చిన ఇరువుర్ కమర్షియల్ గా బ్లాక్ బస్టర్ కాదు. కానీ విమర్శకుల నుంచి విపరీతమైన ప్రశంసలు పొందింది. మణరత్నం క్లాసిక్స్ లో ఒకటిగా నిలిచింది.  అఫ్ కోర్స్.. ఈ కథలోనూ చాలా వరకూ వాస్తవ కథలు చెప్పలేదు. కొన్ని కల్పితాలున్నాయి. మరికొన్ని ‘వదిలేశారు’. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత అంతకంటే ఎక్కువ జెన్యూన్ గా వచ్చిన సినిమా మహానటి. 

రెండో సినిమాకే సావిత్రి వంటి మహానటి కథను తెరకెక్కించాలనుకోవడం దర్శకుడు నాగ్ అశ్విన్ ధైర్యం. కథను మొదలు పెట్టిన విధానం నుంచి నెరేట్ చేసిన విధానం వరకూ అతని నిజాయితీ కనిపిస్తుంది. అలాగే ఇప్పటి వరకూ బాలీవుడ్ లోనూ కనిపించని స్థాయిలో స్క్రీన్ ప్లే ఉంటుంది. ఇది కత్తిమీద సాములాంటి అంశం. అయినా ధైర్యంగా తెరకెక్కించాడు. సావిత్రి అనే సెంట్రల్ పాయింట్ నుంచి ఎక్కడా డీవియేట్ కాకుండానే ఆమె చుట్టూ ఉన్న ముఖ్యమైన పాత్రల్ని పరిచయం చేశాడు. అలాగే ఆమె జీవితంలో విలన్ భర్తే అన్న విషయాన్ని చెప్పడంలోనూ ఎక్కడా జంకలేదు దర్శకుడు నాగీ. అందుకే ఇప్పుడు మణిరత్నం తర్వాత, ఆ స్థాయిలో(అంతకంటే ఎక్కువే అనుకోవచ్చు కూడా) ఓ బయోపిక్ ను తెరకెక్కించి ఆల్మోస్ట్ అతని సరసన నిలిచాయి. ఎలా చూసినా మహానటి అనే సినిమా సావిత్రికి గొప్ప నివాళి.. ఇది ఇంతకు ముందు ఎవరూ ఇవ్వలేదు.. ఇకపైనా ఇస్తారనుకోలేం. అలాగే ఎమ్జీఆర్, కరుణానిధిల కథ కూడా మళ్లీ ఎవ్వరూ టచ్ చేయలేదు. అందుకే ఈ విషయంలో మణిరత్నం తర్వాత ఆ స్థానంలో నాగ్ అశ్వినే ఉంటాడనుకోవచ్చు. 

More Related Stories