English   

నాగ్ అశ్విన్ నెక్ట్స్ ఎవ‌రితో..? 

nag-ashwin
2018-05-11 11:45:12

ఇండ‌స్ట్రీలో అంతే.. జాత‌కం మారిపోవ‌డానికి ఒక్క సినిమా చాలు. ఇప్పుడు నాగ్ అశ్విన్ గురించి ఇండ‌స్ట్రీ అంతా మాట్లాడుకుంటుంది. దానికి ఒకే కార‌ణం మ‌హాన‌టి. సావిత్రి జీవితాన్ని వంద సినిమాల అనుభ‌వం ఉన్న ద‌ర్శ‌కుడిలా తెర‌కెక్కించాడు అశ్విన్. ఈయ‌న ప‌నిత‌నం చూసి ఇప్పుడు ఇండ‌స్ట్రీ అంతా స‌లాం చేస్తుంది. కొంద‌రు ద‌ర్శ‌కులు అయితే తాము కూడా ఇంత అందంగా సినిమాను తీయ‌లేం అని ఈర్ష్య లేకుండా చెప్తున్నారు. దీన్నిబ‌ట్టే అర్థం చేసుకోవ‌చ్చు నాగి ఈ చిత్రాన్ని ఎంత‌బాగా తెర‌కెక్కించాడో..? ఇక ఇప్పుడు అంద‌రిలోనూ ఒక‌టే ఆస‌క్తి.. ఈ కుర్ర ద‌ర్శ‌కుడి త‌ర్వాతి సినిమా ఏంటి అని..? ఇప్ప‌టికైతే మ‌హాన‌టి విజ‌యాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు నాగ్ అశ్విన్. నెక్ట్స్ మాత్రం బ‌యోపిక్ కాకుండా మంచి సందేశం ఉన్న సినిమాను తెర‌కెక్కించాల‌నే ప్లాన్ లో ఉన్నాడు అశ్విన్. తొలి సినిమా ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం కూడా సందేశాత్మ‌క క‌థే. ఇప్పుడు సావిత్రి కూడా అలాంటి క‌థే. మూడో సినిమాలోనూ ఇదే చేయ‌బోతున్నాడు ఈ కుర్ర ద‌ర్శ‌కుడు. ప్ర‌స్తుతానికి ఈ ద‌ర్శ‌కుడి బుర్ర ఖాళీ.. నెక్ట్స్ ఎవ‌రు.. ఏంటి అనే విష‌యంపై క్లారిటీ ఇవ్వ‌డం లేదు. త్వ‌ర‌లోనే ఈ విష‌యంపై స‌మాధానం ఇవ్వ‌నున్నాడు నాగ్ అశ్విన్. 

More Related Stories