English   

థియేటర్లు తెరవాలంటూ నాగ్ అశ్విన్ ఆసక్తికర ట్వీట్

 Nag Ashwin
2020-09-30 12:22:40

కరోనా విజృంభనతో అన్ని పరిశ్రమలతో పాటు సినీ పరిశ్రమ కూడా తీవ్రనష్టాలను ఎదుర్కొంది. సినిమా థియేటర్లు కూడా మూతపడి ఆరునెలలు గడిచిపోయింది. ఇక అన్ లాక్ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా బార్లు, పబ్బులు కూడా తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ ఓ ట్వీట్ చేశారు. అన్ లాక్ ప్రక్రియలో బార్లు ఓపెన్ చెయ్యడానికి పర్మిషన్ ఇచ్చినప్పుడు సినిమా హాళ్లకు ఎందుకు అనుమతి ఇవ్వడంలేదని ప్రశ్నించాడు. సినిమాను మొబైల్ యాప్స్, ఓటీటీ పై కాకుండా థియేటర్ లో చూడాలని అన్నారు. అందరి భద్రత గురించి ఆలోచిస్తానని తెలిపారు. అయితే బస్సులు, రైళ్లు, బార్లు, దేవాలయాలు తెరిచినప్పుడు సినిమహాళ్లు ఎందుకు తెరవలేదని అన్నారు. మాస్క్ పెట్టుకుని సినిమా చూడటానికి తాను చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని పేర్కొన్నారు. థియేటర్ లో పాజ్ చెయ్యడం...ఫార్వర్డ్ చెయ్యడం సాధ్యం కాదని వెల్లడించారు. ఇక ఇండస్ట్రీలో ఈ అంశం పై మరికొందరు కూడా స్పందించే అవకాశం ఉంది.

More Related Stories