English   

ప్రభాస్ నాగ్ అశ్విన్ సినిమా అప్డేట్

Prabhas
2021-01-23 14:06:49

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను వైజయంతి బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని కూడా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్నారు. సినిమాలో ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకునే నటించబోతుంది. అంతే కాకుండా సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నారు. అయితే అమితాబ్ గెస్ట్ రోల్ లో నటించడం లేదని ఓ ఫుల్ లెన్త్ పాత్రలో నటిస్తున్నాడని. ఇప్పటికే దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రకటించారు. ఇదిలా ఉండగా ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ప్రభాస్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ లో దర్శకుడు నాగ్ అశ్విన్ ను టాగ్ చేస్తూ వరుస ట్వీట్ లు చేశారు. అభిమానుల ట్వీట్స్ కు రెప్లే ఇస్తూ నాగ్ అశ్విన్ "కచ్చితంగా చెప్పాలంటే జనవరి 29..ఫిబ్రవరి 26" రోజున అప్డేట్ ఉంటుందని పేర్కొన్నారు. దాంతో అభిమానులు ఆ డేట్స్ కి సినిమా ఫస్ట్ లుక్..లేదంటే టైటిల్ లుక్ విడుదల అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇక నాగ్ అశ్విన్ ఎలాంటి అప్డేట్ ఇస్తారో చూడాలి.

More Related Stories