English   

చిరు సంచ‌ల‌నం.. ఆ కుర్రాడితో సినిమా..!

Nag-Ashwin
2018-05-15 13:57:50

చిరంజీవి ఇప్పుడు సినిమా మూడ్ లోనే ఉన్నాడు. వ‌ర‌స‌గా సినిమాలు చేస్తూ సంచ‌ల‌నం సృష్టిస్తున్నాడు మెగాస్టార్. ప్ర‌స్తుతం ఈయ‌న సైరాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం త‌ర్వాత మ‌రో రెండు సినిమాల‌కు ఓకే చెప్పాడు చిరంజీవి. ఇప్ప‌టికే బోయపాటి సినిమాపై క‌న్ఫ‌ర్మేష‌న్ ఇవ్వ‌గా.. ఈ మ‌ధ్యే కొర‌టాల శివ కూడా క‌లిసాడు. ఈ చిత్రం కూడా ఉండొచ్చనే సూచ‌న‌లు వినిపిస్తున్నాయి. ఇవ‌న్నీ ఇలా ఉంటే ఇప్పుడు మ‌హాన‌టి ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ కూడా చిరంజీవితో సినిమా చేస్తానంటున్నాడు. ఈ విష‌యంపై మెగాస్టార్ కూడా సుముఖంగా ఉండ‌టం విశేషం. క‌థ కుదిర్తే క‌చ్చితంగా నాగ్ అశ్విన్ తో తాను సినిమా చేస్తాన‌ని.. అది కూడా అశ్వినీద‌త్ నిర్మిస్తార‌ని చెప్పాడు చిరు. తాజాగా మ‌హాన‌టి లాంటి గొప్ప సినిమా చేసినందుకు ఆ యూనిట్ ను త‌న ఇంటికి పిలిచి స‌న్మానించాడు మెగాస్టార్. ఈ సంద‌ర్భంగానే తాను చేయ‌బోయే సినిమా గురించి మ‌న‌సులో మాట చెప్పాడు చిరంజీవి. మ‌రి ఈ కాంబినేష‌న్ కానీ ప‌ట్టాలెక్కితే అద్భుత‌మే ఇంక‌.

More Related Stories