English   

వామ్మో.. వ‌ర్మ మామూలోడు కాడు.. 

RGV-Officer
2018-03-08 13:57:37

ఆవ‌లిస్తే పేగులు లెక్క పెట్టేస్తారు అంటారు క‌దా..! వ‌ర్మ‌కు అది కూడా అవ‌స‌రం లేదు. ఆయ‌న చూస్తే చాలు పేగులు కాదు.. అందులో ఉన్న క‌ణాలు కూడా లెక్క పెట్టేస్తాడు. అంత ముదురు. ఎన్ని ప్లాపులు వ‌చ్చినా.. ఎన్ని డిజాస్ట‌ర్లు ఇచ్చినా వ‌ర్మ వ‌ర్మే. ఈయ‌న సినిమా వ‌స్తుందంటే క‌చ్చితంగా అంచ‌నాలు ఉంటాయి. కొన్నేళ్లుగా ఈయ‌న ట్రాక్ రికార్డ్ చూసి ఏ స్టార్ హీరో సినిమా ఇచ్చే ధైర్యం చేయ‌లేదు. అమితాబ్ న‌మ్మి స‌ర్కార్ 3 ఇచ్చినా.. ముంచేసాడు. ఇక ఇప్పుడు నాగార్జున న‌మ్మాడు. గోవిందా గోవిందా త‌ర్వాత 24 ఏళ్లు గ్యాప్ ఇచ్చి నాగ్ తో సినిమా చేస్తున్నాడు వ‌ర్మ‌. ఈ చిత్ర షూటింగ్ ముంబైలో జ‌రుగుతుందిప్పుడు. షూటింగ్ కూడా చివ‌రిద‌శ‌కు వ‌చ్చేసింది. మార్చ్ 30 నాటికి షూటింగ్ అంతా పూర్తి కానుంది. ఇందులో పోలీస్ ఆఫీస‌ర్ గా న‌టిస్తున్నాడు నాగార్జున‌. కేవ‌లం గంటా న‌ల‌భై నిమిషాల నిడివితో వ‌స్తోన్న ఈ సినిమాపై ఇప్ప‌టికే ఇండ‌స్ట్రీలో ఆస‌క్తి మొద‌లైంది. అస‌లు నాగార్జున లాంటి స్టార్ తో ఇలాంటి సినిమా ఎలా చేస్తున్నాడు వ‌ర్మ అంటూ అభిమానుల్లో ర‌చ్చ మొద‌లైంది. కానీ వ‌ర్మ మాత్రం తాను ఏది అనుకుంటే అదే చేస్తున్నాడు. 

వ‌ర్మ-నాగార్జున సినిమా బిజినెస్ కూడా ఇప్పుడు ఇండ‌స్ట్రీలో ట్ టాపిక్ గా మారింది. ట్రాక్ రికార్డుల‌తో ప‌నిలేకుండా విడుద‌ల‌కు ముందే రికార్డులు సృష్టిస్తుంది ఈ చిత్రం. వ‌ర్మ సినిమాను అమేజాన్ ఏకంగా 8 కోట్లు ఇచ్చి రైట్స్ సొంతం చేసుకుంది. దీనికి కార‌ణం కూడా లేక‌పోలేదు. ఈ సినిమా విడుద‌లైన మూడు వారాల‌కే అమేజాన్ లో ఒరిజిన‌ల్ ప్రింట్ పెడ‌తాం అనే ఒప్పందంపై ఇంత భారీ మొత్తం ఇచ్చిన‌ట్లుగా తెలుస్తుంది. అంతా చేస్తే ఈ చిత్ర బ‌డ్జెట్ కూడా అంత లేద‌ని తెలుస్తుంది. నాగ్, వ‌ర్మ ఇద్ద‌రూ రెమ్యున‌రేష‌న్ లేకుండా షేర్ ప్రాసెస్ పై ఈ సినిమా చేస్తున్నారు. ఇంకా శాటిలైట్ తో పాటు డిస్ట్రిబ్యూష‌న్ రైట్స్ కూడా బాకీ ఉన్నాయి. అవ‌న్నీ వ‌చ్చేస‌రికి విడుద‌ల‌కు ముందే నిర్మాత ఫుల్ గా లాభాల్లో ఉంటాడ‌న్న‌మాట‌. మొత్తానికి క‌లిసొచ్చిన హీరోతో చేస్తోన్న సినిమా నిర్మాత‌ల‌కు లాభాల పంట పండిస్తుంది. రేపు సినిమా కానీ విడుద‌లై హిట్ అయిందంటే వ‌ర్మ మ‌రోసారి త‌న స‌త్తా చూపించిన‌ట్లే..! మే 25న ఈ సినిమా విడుద‌ల కానుంది. మ‌రి చూడాలిక‌.. ఏం జ‌ర‌గ‌బోతుందో..?

More Related Stories